ఏపీ : గెలిచే సీట్ల విషయంలో వైసీపీ, టీడీపీ అంచనాలివే.. సీమపై ఆశల్లేవట!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ వై నాట్ 200 అని చెబుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పులివెందులలో సైతం టీడీపీ విజయం సాధిస్తుందని చెబుతున్నారు. టీడీపీ, వైసీపీ గెలిచే సీట్ల విషయంలో కొన్ని అంచనాలను పెట్టుకున్నాయని ఆ అంచనాల ప్రకారమే ఎన్నికల ఫలితాలు వస్తాయని భావిస్తున్నాయని సమాచారం అందుతోంది. 110 నుంచి 120 సీట్లలో టీడీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.
 
వైసీపీ మాత్రం 120 నుంచి 130 స్థానాలలో పార్టీ విజయం సాధిస్తుందని లెక్కలు వేసుకుందని సమాచారం అందుతోంది. రాయలసీమ విషయంలో మాత్రం రెండు పార్టీలు క్లారిటీతో ఉన్నాయని తెలుస్తోంది. రాయలసీమలో 40 నుంచి 45 స్థానాలు వస్తాయని వైసీపీ ఫీలవుతుండగా 10 నుంచి 15 స్థానాలు వస్తాయని టీడీపీ ఫిక్స్ అయిందని సమాచారం. మిగతా జిల్లాలకు సంబంధించి మాత్రం ఒక్కో పార్టీ లెక్కలు ఒక్కోలా ఉన్నాయి.
 
ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని టీడీపీ జనసేన బీజేపీ భావిస్తుండగా వైసీపీ మాత్రం కనీసం 50 శాతం సీట్లలో విజయం ఖాయమని ఫీలవుతోంది. ప్రకాశం జిల్లాలో 70 శాతం స్థానాలు వైసీపీవేనని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
 
టీడీపీ, వైసీపీలకు ఎన్నికల్లో గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ ఉన్న నేపథ్యంలో గతంతో పోల్చి చూస్తే ఈ పార్టీల నేతలు భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయని సమాచారం అందుతోంది. చంద్రబాబు, జగన్ లెక్కల్లో ఎవరి లెక్కలు నిజమవుతాయో చూడాలి. రాయలసీమలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉండటం ఆ పార్టీకి ప్లస్ అవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మరింత కష్టపడితే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: