ఏపీ: జరగబోయే ఎన్నికలపై ఇండియా టీవీ సర్వే చూస్తే మతి పోతుంది... అంతా తారుమారే?

Suma Kallamadi
అతి త్వరలో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఈపాటికే పలు సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెలువడిన సంగతి విదితమే. ఇందులో కొన్ని అధికార పార్టీ వైసీపీకి మొగ్గు చూపగా, మరికొన్ని విపక్ష ఎన్డీయే కూటమికి జై కొట్టడం అందరికీ తెలిసినదే కధే. ఈ నేపథ్యంలో తాజాగా జాతీయ మీడియా ఛానల్ ఇండియా టీవీ తాజాగా ఒపీనియన్ పోల్ ఒకటి నిర్వహించింది. ప్రస్తుతం దాని ఫలితాలు వెలువడ్డాయి. దాంతో ఏపీలో ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపుతున్నారనేది ఇండియా టీవీ వెల్లడించింది.
ఆ ఫలితాలు చూస్తే దిమ్మ తిరిగిపోయేలా వున్నాయి అనడంలో సందేహమే లేదు. ఇందులో ఏపీలోని 25 ఎంపీ సీట్లలో అధికార వైసీపీ కేవలం 10 సీట్లు మాత్రమే దక్కించుకోబోతున్నట్లు తెలిపింది. అవును, ప్రస్తుతం 22 ఎంపీ సీట్లు కలిగి ఉన్న అధికార వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు కోల్పోయి 10 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతున్నట్లు తెలిపింది. ఇక వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఎన్డీయే కూటమికి ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపుతూ ఫలితాలను వెలువరించింది. అయితే క్లీన్ స్వీప్ చేసే పరిస్దితులు మాత్రం ఎంతమాత్రమూ లేవని ఇక్కడ తేటతెల్లం చేసింది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని టీడీపీకి 12 ఎంపీ సీట్లు వస్తాయని, అలాగే బీజేపీ 3 సీట్లు గెల్చుకుంటుందని ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ తెలిపింది.
ఇక ఇదే కూటమిలో జనసేన రెండు సీట్లలో పోటి చేస్తున్నప్పటికీ ఒక్క సీటు అయితే గెలుచుకొనే అవకాశం లేకపోలేదు అన్నట్టు ఇండియా టీవీ ఫలితాలలో సుస్పష్టం చేసింది. ఈ లెక్కను అసెంబ్లీ ఫలితాలకు వర్తింపచేస్తే టీడీపీ 12 ఎంపీ సీట్లలో అంటే దాదాపు 84 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు అయితే ఇక్కడ అర్ధం అవుతోంది. అలాగే బీజేపీ 3 సీట్లలో అంటే 21 సీట్లలో ఆధిక్యం అందుకొనే అవకాశం వుంది. అయితే ఇక్కడ బీజేపీ కేవలం 10 సీట్లలోనే పోటీ చేస్తోంది కాబట్టి మిగతా స్ధానాల్లో ఈ ఓటింగ్ కూటమిలో ఇతర పార్టీలకు పడొచ్చు. అనే జనసేన ఈసారి తన ఉనికిని చాటుకుంటోంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే వైసీపీ 10 ఎంపీ సీట్లు సాధిస్తే 70 సీట్ల వరకూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: