జగన్ : 30 పార్టీలు కలిసొచ్చినా భయపడేదేలే.. ఒక్క సీటు కూడా తగ్గేదేలే!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మదనపల్లె బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. 30 పార్టీలు కలిసొచ్చినా భయపడేదేలే.. ఒక్క సీటు కూడా తగ్గేదేలే అనే కామెంట్లు వైసీపీ నేతల్లో జోష్ నింపాయి. 2019 ఎన్నికల ఫలితాల మ్యాజిక్ ఈ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారు.
 
చంద్రబాబు పరిపాలనతో పోల్చి చూస్తే తన పాలన ఎన్నో రెట్లు బెటర్ అని జగన్ భావిస్తున్నారు. కూటమికి జనం 10 మార్కులు వేశారని తనకు 99 మార్కులు వేశారని 99 మార్కులు వచ్చిన నేను భయపడతానా అంటూ జగన్ ప్రశ్నించారు. వదల బొమ్మాలి అంటూ పసుపుపతి పేదల రక్తాన్ని పీలుస్తారంటూ జగన్ చేసిన సెటైరికల్ కామెంట్లు భలే పేలాయి. బాబుకు మోసాలు చేయడమే అలవాటని అబద్ధాలు పునాదులుగా బాబు బ్రతుకుతున్నారని అధికారం కోసం 2014లో పొత్తు పెట్టుకున్న బాబు మరోసారి పసుపుపతిగా మారారని జగన్ కామెంట్లు చేశారు.
 
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అంటూ జగన్ చేసిన కామెంట్లు చంద్రబాబు సానుభూతిపరులను ఆలోచింపజేస్తున్నాయి. 2014 నుంచి 2019 మధ్య ఏపీలో అభివృద్ధి జరగలేదని సంక్షేమ పథకాలు సైతం సరిగ్గా అందలేదని ప్రజల్లో భావన ఉంది. వైసీపీ పాలనలో మాత్రం వాలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా పథకాలు సకాలంలో అందుతున్నాయి.
 
తన పాలన చూసి ఓటేయాలని జగన్ చెబుతుండగా చంద్రబాబు నుంచి అలాంటి కామెంట్లు మాటవరసకైనా రావడం లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసాన్ని పొందడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో ప్రశ్నించుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందో లేక వైసీపీ అధికారంలోకి వస్తుందో చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: