భారతదేశం: లోక్‌సభ ఎన్నికల బరిలో ఆరుగురు ఎక్స్ సీఎంలు.. ఎక్కువ డబ్బున్న ముఖ్యమంత్రి అతనే..?

Suma Kallamadi
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వారి ఆస్తుల వివరాలు హాట్ టాపిక్ గా మారాయి ఆ ముఖ్యమంత్రి ఎవరు వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, వారందరిలో ఎక్కువ ధనవంతుడుగా ఎవరు ఉన్నారో తెలుసుకుందాం పదండి.
• మనోహర్ లాల్ (హర్యానా):
మొత్తం ఆస్తులు: సుమారు రూ.27 లక్షలు, బ్యాంక్ ఖాతాల్లో  ఆస్తులు సుమారు రూ.2.5 లక్షలు. పర్సనల్ లోన్: రూ.5 లక్షలు. స్థిరాస్తి: రూ.50 లక్షలకు పైగా విలువ చేసే వ్యవసాయ భూమి, 3 లక్షల విలువైన ఇల్లు ఉన్నాయి.
• బసవరాజ్ బొమ్మై (కర్ణాటక):
మొత్తం ఆస్తులు: రూ.42.15 కోట్లు (కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం). హిందూ అవిభక్త కుటుంబ ఆస్తులు: సుమారు రూ.19.2 కోట్లు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు 2022, మార్చి 26న తరిహాల గ్రామంలో మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుత మొత్తం ఆస్తుల విలువ రూ.52.12 కోట్లు (2023 నాటికి).
• త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్):
క్యాష్ రూపంలో చూసుకుంటే త్రివేంద్ర సింగ్ రావత్: 56 వేలు, భార్య: రూ.32 వేలు, బ్యాంకు ఖాతాల్లో రావత్ ఆస్తులు రూ.59,88,913, భార్య రూ.94,80,261.
 
బంగారం: రావత్: 40 గ్రాములు (సుమారు రూ.2.5 లక్షలు), భార్య: 110 గ్రాములు (విలువ రూ.6,79,800).
ఇతర ఆస్తులు: రావత్ ఆస్తుల విలువ రూ.62,92,113.
భార్య ఆస్తుల విలువ రూ.1,01,92,061.
స్థిరాస్తి
 భార్య పేరు మీద ఆస్తి విలువ రూ.1,08,68,060.
 రుణం: రూ.75 లక్షలు.
• బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర)
 నగదు విషయానికి వస్తే బిప్లబ్ కుమార్ దేబ్ ఆస్తులు  రూ.52,000. భార్య ఆస్తులు కేవలం రూ.2,400. బిప్లబ్ బ్యాంకు ఖాతాల్లో ఆస్తులు రూ.92,78,838. భార్య అకౌంట్‌లో ఆస్తులు రూ.1,07,47,000.
 
బంగారం విషయానికొస్తే బిప్లబ్: రూ.3 లక్షలు, భార్యకు రూ.7 లక్షలు.  ఇతర ఆస్తులు రూ.95,78,838 (మూవబుల్ ప్రాపర్టీ), భార్య: 1,89,17,755 (స్థిర ఆస్తి).
 భార్య పేరు మీద రూ.61 లక్షలు (స్థిర ఆస్తి).
• శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్):
మొత్తం ఆస్తులు సుమారు రూ.3.21 కోట్లు, భార్య ఆస్తులు సుమారు రూ.5.41 కోట్లు. అతని పేరు మీద ఉన్న చరాస్తులు విలువ రూ.1,11,20,282. అతని పేరు మీద స్థిరాస్తుల విలువ 2.10 కోట్లు.
• కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్):
కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.19 కోట్లు, గుర్తించదగిన ఆస్తులు చూసుకుంటే జూబ్లీహిల్స్‌లోని బంగ్లా, దాని విలువ సుమారు రూ.9 కోట్లు. కార్లు: మారుతి, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా SUV, వోక్స్‌వ్యాగన్, ఇతర వాటితో సహా.
ఈ మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టగానే వారి ఆర్థిక స్థితిగతులను ఈ వివరాలు వెలుగులోకి తెస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: