గుంటూరు: మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ఓట‌మిపై లెక్క‌లివే..!

RAMAKRISHNA S.S.
వైసీపీ నాయ‌కురాలు, మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ఓట‌మి ఖాయ‌మా ?  అంటే ఈ సారికి ఆమెకు గెలుపు గ‌త ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట‌లో గెలిచినంత వీజీ అయితే కాద‌నే రాజ‌కీయ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరి పేట నుంచి పోటీ చేశా రు. అయితే.. అక్క‌డ ఆమెకు తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. అక్క‌డే టికెట్ ఇస్తే. ఖ‌చ్చితంగా భారీ ఓట్ల తేడాతో ఆమె ప‌రాజ‌యం పాల‌వ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ‌లు జ‌రిగాయి. వైసీపీ నిర్వ‌హించిన స‌ర్వేల్లో కూడా.. ఇదే విష‌యం వ్య‌క్త‌మైంది.


దీంతో పోయి పోయి నియోజ‌వ‌క‌ర్గాన్ని వ‌దులుకోవ‌డం ఇష్టం లేక‌.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా ఆమెను గుంటూ రు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గానికి బదిలీ చేసింది. అయితే.. ఇక్క‌డైనా ఆమె పుంజుకున్నారా?  అంటే లేదు. నాయ కులను చేరువ చేసుకోవ‌డంలో ఆమె విఫ‌ల‌మ‌య్యారు. పైగా చిల‌క‌లూరిపేట టికెట్‌ను ఇప్పించేందుకు రు. 6.5 కోట్ల రూపాయ‌లు లంచం తీసుకున్నార‌ని.. వైసీపీ నాయ‌కుడే ఆరోపించారు. దీనిపై పంచాయ‌తీ కూడా జ‌రిగింద ని ఆయ‌న ఆధారాల‌తో స‌హా మీడియా ముందుకు వ‌చ్చారు. ఇది విడ‌ద‌ల ర‌జ‌నీకి మ‌రింత మైన‌స్‌గా మారింది.


ఈ ఆరోప‌ణ‌ల తర్వాత‌.. విడ‌ద‌ల ర‌జ‌నీ మౌనంగా ఉన్నప్ప‌టికీ.. ఆమెకు క్షేత్ర‌స్థాయిలో జ‌ర‌గాల్సిన డ్యామే జీ అయితే జ‌రిగిపోయింది. ఇక‌, గుంటూరు వెస్ట్ అంటేనే టీడీపీకి కంచుకోట‌గా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ టీడీపీనే ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. టీడీపీ త‌ర‌ఫున మ‌ద్దాలి గిరి ధ‌ర్ విజ‌యం సాధించిన త‌ర్వా త‌.. ఆయ‌న వైసీపీ బాట ప‌ట్టారు. సో.. ఆయ‌న వెళ్లిపోయినా.. ఆయ‌న వెంట ప‌ట్టుమ‌ని 100 మంది టీడీపీ నాయ‌కులు కూడా వెళ్ల‌లేదు. అంటే.. నియోజ‌క‌వ‌ర్గాన్ని, పార్టీని న‌మ్ముకుని వారు ఇక్క‌డే ఉన్నారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌యోగం చేసింది.


ఇక గ‌త కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో న‌గ‌రం మొత్తం మీద టీడీపీ త‌క్కువ డివిజ‌న్లే గెలిచినా అందులో ఒక్క డివిజ‌న్ మిన‌హా మిగిలిన‌వి అన్నీ ప‌శ్చిమ డివిజ‌న్‌లోనే ఉన్నాయి. అంత వేవ్‌లోనే పార్టీ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో మంచి పెర్పామెన్స్ ఇచ్చింది. అప్ప‌ట‌కి ఇప్ప‌ట‌కీ చాలా తేడా వ‌చ్చేసింది. పార్టీ మ‌రింత బ‌లంగా పుంజుకుంది. పైగా ఈ సారి టీడీపీ కూడా అన్నీ ఈక్వేష‌న్ల ప‌రంగా ర‌జ‌నీకి ధీటైన అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డం.. వ్య‌క్తిత్వ ప‌రంగా ర‌జ‌నీ కంటే టీడీపీ క్యాండెట్ పిడుగురాళ్ల మాధ‌వి సౌమ్యురాలిగాను.. త‌న‌దైన భాష‌తోనూ ఆకట్టుకునే ప్ర‌సంగాలు చేస్తూ ప్ర‌జ‌ల్లోకి దూసుకు వెళుతున్నారు.


ఇక ర‌జ‌నీ అయినా.. త‌న స‌త్తా చాటుకుని..ఇక్క‌డ పార్టీని పుంజుకునేలా చేస్తున్నారా? అంటే అది లేక‌పోగా.. త‌న ఒంటెత్తు పోక‌డ‌ల‌తో పార్టీని మ‌రింత దారుణంగా నాశ‌నం చేస్తున్నార‌న్న టాక్ సొంత పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది. సీనియ‌ర్ల మాట‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. జూనియ‌ర్లు వ‌స్తే.. వారిని లైట్ తీస్కొంటున్నార‌ట‌. మీరున్న‌ది మాకు సేవ చేయ‌డానికి ప్ర‌చారం చేయ‌డానికి అన్న‌ట్టుగా నే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ వాళ్లు గ‌గ్గోలు పెడుతున్న ప‌రిస్థితి. దీంతో క్షేత్ర‌స్థాయిలో వైసీపీ ప్ర‌చారం కూడా
ఇష్టంగా కాకుండా డ‌బ్బుతోనే బ‌ల‌వంతంగా జ‌రుగుతోంది. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు విడ‌ద‌ల ర‌జ‌నీ టీడీపీ కంచుకోట‌లో గెలిస్తే చాలా గొప్ప అనే అంటున్నాయి గుంటూరు రాజ‌కీయ వ‌ర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: