జగన్ ట్రాప్ లో పడుతున్న టిడిపి కూటమి..!!

Divya
రాజకీయాలు అన్నాక ఎవరు ఎత్తుగడలు వారికి ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల వ్యూహాలు వారు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు.. ప్రత్యర్థులను ఇరకాట పెట్టే ప్రయత్నాలలో కూడా చేస్తూ ఉంటారు.ఈ విషయంలో తెలుగు రాష్ట్ర నేతలు సైతం ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా జగన్ ఈ విషయంలో ఆరితేరిపోయారని కూడా చెప్పవచ్చు. గత ఎన్నికలలో ప్రత్యేక హోదాను సైతం అడ్డుపెట్టుకొని మరి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి చంద్రబాబును దూరం చేసి సక్సెస్ అయ్యారు. గత ఎన్నికలలో కూడా చంద్రబాబు చేయని హామీలను కూడా చూపించి సక్సెస్ కావడం జరిగింది.

గత ఐదు సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి మాత్రం ఎన్నో రకాలుగా సపోర్టు చేస్తూ వస్తోంది. టిడిపి ప్రభుత్వం కూడా ఎన్డీఏలో ఇటీవలే చేర్చుకుంది. ఇటీవల ప్రధాని మోడీ కూడా ఆంధ్రాకి రావడంతో చంద్రబాబు వేదిక చాలా గ్రాండ్గా చేశారు అయితే అక్కడ వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఏ మాత్రం అనకపోవడంతో ఆ సభ అక్కడున్న వారందరినీ కూడా నిరాశపరిచిందని తెలుస్తోంది. కేవలం కాంగ్రెస్ జగన్ ఒకటే అంటూ వెల్లడించారు. అయితే ఈసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వమే అధికారంలోకి మూడోసారి రావాలంటే తెలియజేశారు.

ఏపీలో వాలంటరీల విషయంలో జగన్ సైతం ఒకరకంగా ఆలోచిస్తూ ఉన్నారు. వాలంటరీలంతా కూడా వైసిపి వాళ్ళే కచ్చితంగా వారు ఎన్నికలలో వైసీపీకి సహకరిస్తారని..అయితే దీంతో ఈ రెండు నెలలలో వాలంటరీల వ్యవస్థను పక్కన పెట్టాలని ఆదేశాలను సైతం కోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని కూడా ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఏపీ సీఎం భావిస్తున్నారు ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు తెచ్చేందుకు వాలంటరీ వ్యవస్థను కూడా తానే ప్రారంభించారని దీనివల్ల ప్రతిపక్ష నేతలను ఇరకాటంలో పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. చూస్తూ ఉంటే కచ్చితంగా కూటమి మొత్తం జగన్ ట్రాప్ లో పడేలా కనిపిస్తోంది. గతంలో కూడా వాలంటరీ వ్యవస్థ పైన పథకాల పైన ఎన్నో రకాల ఆరోపణలు చేసినట్లుగా ఎల్లో మీడియా సైతం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: