టీడీపీ, జనసేన సీట్లపై బీజేపీ ఆశ?

Purushottham Vinay
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి 6 పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాలను కేటాయించడం జరిగింది.జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తోంది.మిగిలిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లకు తెలుగు దేశం పార్టీ పోటీ పడుతోంది. అయితే ఇప్పటి దాకా మూడు పార్టీల పార్లమెంటు అభ్యర్థులు ఖరారు కాలేదు.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాము పోటీ చేసే రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటైన కాకినాడకు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ ను అభ్యర్థిగా ప్రకటించారు.తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం బీజేపీ వైఖరేనని అంటున్నారు.టీడీపీ, జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటున్న కొన్ని సీట్లను బీజేపీ ఆశిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనకాపల్లి, విజయనగరం ఎంపీ సీట్లను బీజేపీకి ఇవ్వాలని తెలుగుదేశం భావించగా బీజేపీ మాత్రం అనకాపల్లి ఎంపీ స్థానానికి బదులు విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని, విజయనగరంకు బదులుగా అమలాపురం పార్లమెంటు సీటును ఆశిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.


బీజేపీకి మొత్తం పది అసెంబ్లీ స్థానాలు కేటాయించగా ఇప్పటికే టీడీపీ, జనసేన ప్రకటించిన సీట్లను ఆ పార్టీ ఆశిస్తోందని అంటున్నారు. అనపర్తి, పాడేరు, ఆదోని, గుంటూరు పశ్చిమ, శ్రీకాళహస్తి ఇంకా కదిరి సీట్లను బీజేపీ కోరుతోందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సీట్లకు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సీట్లను తమకు వదిలేయాలని బీజేపీ కోరుతోందని సమాచారం తెలుస్తుంది.ఈ నేపథ్యంలో సీట్ల మార్పు అనేది అనివార్యమంటున్నారు. జనసేన పార్టీ కూడా కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. వీటిలో కూడా ఇప్పటి దాకా కేవలం ఏడు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మొత్తం 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటున్న సీట్లలో కొన్నిటిని కూడా బీజేపీ కోరుతోందని సమాచారం తెలుస్తుంది.ఇప్పటికే బీజేపీకి కేటాయించిన ఆరు పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇంకా తదితర నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసి పోటీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సమర్పించారని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: