జనసేనానిపై ఆ ఎమ్మెల్యే సెటైర్లు?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఇక పార్టీలు ఇప్పటినుంచే ప్రచారాలు మొదలు పెట్టాయి.పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించడం జరిగింది.ఇకపై తాను పిఠాపురంలోనే ఉంటానని, ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.తనను గెలిపిస్తే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ హామీ యిచ్చారు. కాకినాడ లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పేరుని ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యే.. రెండిటిలో దేనికి పోటీ చేస్తారని బీజేపీ కేంద్ర నేతలు తనను అడిగితే… అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పందించారు.


జనసేనాని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు టిక్ పెట్టాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ఎమ్మెల్యే ద్వారంపూడి పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేశారు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి పవన్ కల్యాణ్‌కి అసలు ఏంటి ఈ కర్మ అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఇదని ఆయన వాపోయారు. తన సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం వెళుతున్నాడు కానీ అక్కడి ప్రజలు ఆయనను ఓడిస్తారని జోస్యం చెప్పారు.ఇక పిఠాపురం నుంచి ఈసారి వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఇంటింట ప్రచారం కూడా మొదలుపెట్టడం జరిగింది. పవన్ కల్యాణ్‌ పై పోటీ చేయడానికి తానేమి భయపడడం లేదని, కచ్చితంగా గెలుస్తానని వంగా ఎంతో గీత దీమాగా చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఆగడం లేదు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉండి పొత్తులు పెట్టుకోవడం చాలా మందికి కూడా నచ్చట్లేదు. సొంత ఫ్యాన్స్ కొంతమంది ఆయన్ని బాగా విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: