గోదావరి : పిఠాపురంలో పవన్ కు చుక్కలు కనబడటం ఖాయమా ?
రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటానికి రాష్ట్రంలో సేఫెస్ట్ సీటు ఏదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా నియోజకవర్గాలను పరిశీలించారు. చాలా నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నారు. అన్నీ సర్వేరిపోర్టులు చూసుకున్న తర్వాత అనేక అంశాలను భేరీజు వేసుకున్న తర్వాత చివరకు తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో పోటీచేయాలని డిసైడ్ చేసుకున్నారు. అందుకనే పిఠాపురంలో తాను పోటీచేస్తున్నట్లు పార్టీ ఆఫీసులో ప్రకటించారు.
పవన్ ఇక్కడే పోటీచేయాలని నిర్ణయించుకోవటం వెనుక బలమైన కారణం ఒకటుంది. అదేమిటంటే నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు బాగా ఉండటమే. 2.6 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు సుమారు 70 వేలుంటుందని అంచనా. అందుకనే ఈ నియోజకవర్గాన్ని ఏరికోరి పోటీచేయటానికి ఎంచుకున్నారు. పవన్ కోణంలో పిఠాపురంలో ఓకేనే కాని గ్రౌండ్ రిపోర్టు ప్రకారం పవన్ గెలుపు అంత వీజీ కాదు. ఒకవేళ ఓడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని అంటున్నారు. ఎందుకంటే పవన్ ముఖ్యంగా ఆధారపడింది కాపు సామాజికవర్గం ఓట్లపైనే.
అయితే కాపుల్లో కూడా నూరుశాతం జనసేనకు మద్దతుగా లేరు. ఒకపుడు కాపుల్లో మెజారిటి పవన్ వైపున్నారు. కాని సీట్ల సర్దుబాటులో పవన్ 24 నియోజకవర్గాలకు అంగీకరించటం, తర్వాత అది 21 సీట్లకు తగ్గిపోవటంతో పవన్ పై బాగా నెగిటివ్ ప్రభావం చూపిస్తోంది. చంద్రబాబునాయుబుతో పొత్తుపెట్టుకునే విషయంలో పవన్ వైఖరిపైన అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో కాపేతర సామాజికవర్గాల్లో కూటమిపైన వ్యతిరేకత బాగా కనబడుతోందట. కాపులు 70 వేలమంది ఉన్నా కాపేతర సామాజికవర్గాల ఓటర్లు సుమారు 1.9 లక్షలున్నారు. మొత్తం ఓటర్లలో 2 లక్షల ఓట్లే పోలయ్యాయని అనుకున్నా అదే దామాషాలో కాపుల ఓట్లు కూడా తగ్గిపోయే అవకాశముంది. అది పవన్ కు బాగా మైనస్ అవుతుంది.
ఇక ముఖ్యమైన రెండు పాయింట్లు ఏమిటంటే మొదటిది వైసీపీ అభ్యర్ధిగా వంగా గీత పోటీచేస్తుండటం. ఈమె కూడా కాపు నేతే+బాగా పాపులర్. ఇక రెండోది తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేయటానికి మాజీ ఎంఎల్ఏ వర్మ రెడీ అవుతున్నారు. వర్మ పోటీలో ఉంటే పవన్ గెలవటం కష్టమే. కాబట్టి పవన్ కు పిఠాపురంలో చుక్కలు కనబడటం ఖాయమనే అనిపిస్తోంది.