బాబు సూపర్ సిక్స్ పేరుతో గిఫ్ట్ బాక్స్.. వీడియో వైరల్..!!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చాలామంది నేతలు వారి పార్టీల పైన ప్రచారం చేసుకోవడమే కాకుండా ఇతర పార్టీల పైన బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.. ఎవరికివారు యమునా తీరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గడిచిన వారం రోజుల క్రితం అటు టిడిపి పార్టీలు కండోమ్ పంచుతున్నట్లుగా కొన్ని వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇలాంటివి చుసి ప్రజలు కూడా చాలానే అసహ్యించుకుంటున్నారు.

ఇప్పుడు తాజాగా మళ్లీ చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల పేరుతో కొన్ని గిఫ్ట్ బాక్స్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ..టిడిపి నేతలు బూత్ కమిటీ మెంబర్లతో ఇలాంటి సూపర్ సిక్స్ పేర్లతో గిఫ్ట్ బాక్స్ లను సైతం పంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ బాక్సు ఓపెన్ చేసి చూడగా అందులో లిక్కర్ బాటిల్ తో పాటు సిగరెట్లు చిప్స్ కండోమ్ ప్యాకెట్స్ ఇంకా డబ్బులతో పాటు మనీ కవర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటన్నిటి పైన చంద్రబాబు లోకేష్ ఫోటోలు పెట్టారని వీడియో తీసి పలు రకాల పోస్టులు షేర్ చేయడం జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా మంది ప్రజలు వీరిని తిట్టిపోస్తున్నారు.. అయితే ఈ వీడియోలో రంగయ్య అనే పేరు వ్యక్తి మీద ఈ గిఫ్ట్ బాక్స్ వచ్చిందని ఓపెన్ చేసే ముందు చెప్పగా.. ఇలాంటి చిల్లర పనులు టిడిపి చేస్తోందా అంటూ పలువురు ట్విట్టర్ రూపంలో రీ ట్వీట్ చేస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఈసారి ఎన్నికలలో గెలవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిన్నటి రోజున తాడేపల్లిలో సభ ఏర్పాటు చేయగా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ తో నానా హంగామా చేశారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: