Ycp పార్టీదే మళ్ళీ విజయం.. జన్ మత్ లేటెస్ట్ సర్వే..!!

Divya
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఎక్కువగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు.. ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా ప్రవేశపెట్టి.. ఎంతోమంది హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. ముఖ్యంగా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధినీ రెండిటిని జోడిస్తే ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ పరిపాలన ఇలా సాగుతుంటే మరొకవైపు పలు రకాల సర్వేలు సైతం రోజురోజుకి ఇంకో హడావిడి కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు సైతం పలు రకాల సర్వేలను వెల్లడిస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా జన్ మత్ సర్వే ఏపీలో మరొకసారి కలకలా అని రేపేలా కనిపిస్తోంది... ఈ సర్వేలో వైఎస్ఆర్సిపి ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆ సంస్థ వెల్లడించింది.. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం గురించి తెలుపుతూ..2024 దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఏపీలో అధికార పార్టీ వైసీపీ 175 స్థానాలలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ పార్టీ పరంగా ముందుకు వెళ్తున్నారు.

టిడిపి జనసేన లో మాత్రం ఇప్పటివరకు లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు.. ఇప్పుడు తాజాగా జన్ మత్ సర్వే తెలుపుతున్న ప్రకారం మొత్తం మీద లోక్సభ స్థానాలు 543 ఉండగా.. ఇందులో బిజెపి పార్టీ 324 నుంచి 327 సీట్లు వస్తాయని కాంగ్రెస్కు... 45 నుంచి 47 వస్తాయని.. వైసీపీ పార్టీకి 17 నుంచి 19 సీట్లు వస్తాయని.. టిడిపి కూటమితో ఆరు నుంచి ఏడు స్థానాలు వస్తాయని మమతా బెనర్జీ పార్టీ 22 నుంచి 24 స్థానాలు అమ్ ఆద్మీ పార్టీ 6 నుంచి ఏడు స్థానాలలో విజయం అందుకుంటుందని ఈ జన్ మత్ సర్వే తెలియజేసింది.. ఆంధ్రాలో వైసీపీ ప్రభంజనం మరొకసారి స్పష్టంగా ఉంటుందంటూ ఈ సర్వే తెలిపింది కేంద్రంలో మోడీ ప్రభుత్వమే వస్తుందంటూ ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది.మరో సర్వేలో వైసీపీ పార్టీకి.. mla సీట్ల విషయంలో 117-128 సీట్లు వస్తాయని తెలిపారు.. టిడిపి జనసేన 47 నుంచి 58 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ సర్వేలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: