రాజధాని ఫైల్స్ తో చంద్రబాబు బొక్క బోర్ల పడ్డట్టే..!!

Divya
ఈ మధ్యకాలంలో వరుసగా పొలిటికల్ సినిమాలు చాలానే విడుదలవుతున్నాయి. ఏపీలోని ఎన్నికల సమయం కాబట్టి రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమాలు వరుసగా విడుదల అవుతూ ఉన్నాయి.. అయితే ఈ విషయం కొత్తేమీ కాకపోయినా గతంలో కూడా ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి వాటి ఫలితాలు ఎలా ఉన్న కాంట్రవర్సీ లతో కావాల్సిన మైలేజ్ అయితే కొన్ని రకాల పార్టీలు తెచ్చుకున్నాయి. ఇటీవలే మహివీ రాఘవ దర్శకత్వంలో యాత్ర-2 సినిమా కూడా విడుదల అయింది.

ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా ఈ సినిమా తీశారని చాలామంది ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక చిత్రాన్ని కూడా రూపొందించారు. ఆ సినిమాని రాజధాని ఫైల్స్.. ఈ చిత్రాన్ని తెలుగు ఓన్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాని డైరెక్టర్ భాను శంకర్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ట్రైలర్ కూడా ఒక సెన్సేషనల్ గా క్రియేట్ అయింది. ఈ సినిమా పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ .. ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రతిపక్షం ఇన్ డైరెక్ట్ గా భారీగానే ప్రమోట్ చేసింది. చంద్రబాబు కూడా ఈ సినిమాని చూడమంటూ తమ అభిమానులకు ప్రజలకు కూడా విన్నవించుకున్నారు.

అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ అధికారికంగా ప్రభుత్వం ప్రయత్నించిన దర్శకనిర్మాతలు కోర్టు నుంచి స్టేట్ తెచ్చుకొని మరి విడుదల చేశారు. పబ్లిసిటీ ఎంత తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గోరంగా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఉన్న వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ సినిమాని తెరకెక్కించిన విడుదలైన రెండు రోజుల ముందు వరకు ప్రెస్ మీట్ పెట్టి నానా హంగామా చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఈ సినిమా సింపతి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిన దాని వల్ల కూడా ఈ సినిమా నిలబడలేకపోయింది.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాలు ఉన్న జనాలు థియేటర్లకు తీసుకురాలేకపోయింది. దీంతో ఈ సినిమా అటు టిడిపి పార్టీకి కూడా చాలా డ్యామేజ్ ను తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. దీన్నిబట్టి చూస్తే ఏపీలో జగన్ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: