దేశంలోనే మొదటి స్థానంలో.. జగన్ సిద్ధం..!!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజలలో భారీ క్రేజీ అందుకున్నారు. ముఖ్యంగా యువత మనసులో సుస్థిరమైన స్థానాన్ని సైతం ఏపీ సీఎం జగన్ ఏర్పరచుకున్నారు. ఇలా చెప్పటానికి ఈ ఘటన సాక్ష్యం అన్నట్లుగా పలువురు నేతలు సైతం వివరిస్తున్నారు.. అసలు విషయంలోకి వెళితే నిన్నటి రోజు అనంతపూర్ జిల్లాలోని రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపుగా అక్కడికి ప్రజలు 10 లక్షల మందిపైగా వచ్చినట్లు తెలుస్తోంది.



అయితే రాప్తాడులో జరిగిన సిద్ధం సభ సీఎం జగన్ సిద్ధమయ్యారు అనే వార్త అధికారికంగా వచ్చినప్పటి నుంచి జగన్ అభిమానులు, వైసిపి కార్యకర్తలు సైతం ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా రోజురోజుకీ వైసీపీ అభిమానులు భారీ పాపులారిటీ పెంచేస్తున్నారు. ఎప్పటికప్పుడు సిద్ధం అప్డేట్లను సైతం షేర్ చేస్తూ నయా ట్రెండ్ ని సృష్టిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సిద్ధం కార్యక్రమం ట్రెండింగ్ లో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి విషయం అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉంటారు.


ముఖ్యంగా ట్విట్టర్ ,ఫేస్బుక్ ఇతరత్రా వాటిలో సిద్ధం సభకు సంబంధించిన ఎలాంటి ఫోటోలైన వీడియోలైనా సరే వైరల్ గా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో దేశంలోనే మొదటి స్థానంలో సిద్ధం అనే పేరు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని సైతం అటు వైసిపి నేతలు అభిమానులు సైతం తెగ వైరల్ గా చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం చెప్పలేనిదని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు సైతం అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వాటన్నిటిని ఏపీ సీఎం మాత్రం తిప్పికొడుతూ సరికొత్త నయా ట్రెండు తో ముందుకు వెళుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: