రాయలసీమ : రాప్తాడు సభ దద్దరిల్లిపోయిందా

Vijaya

అధికారపార్టీ వైసీపీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలు సిద్ధం రాప్తాడులో రికార్డు సృష్టించిందా ? అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రాజకీయంగా ఎంతో కీలకమైంది. ఇక్కడ నుండి వైసీపీ ఎంఎల్ఏగా దోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నేత పరిటాల సునీత పోయిన ఎన్నికల్లో ఓడిపోయారు. వచ్చేఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సునీత, రెండోసారి గెలిచి తీరాలని తోపుదుర్తి మహా పట్టుదలగా ఉన్నారు.



అందుకనే రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం చాలా కీలకం కాబోతోంది. ఇలాంటి నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. ఈ బహిరంగసభను గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా నిర్వహించేందుకు వైసీపీ అన్నీ ఏర్పాట్లు చేసింది. కారణం ఏమిటంటే ఇక్కడ నుండే జగన్ 2024 ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను రిలీజ్ చేయటమే. రాబోయే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.



వచ్చేఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని 14 సీట్లను క్లీన్ స్వీప్ చేయాలన్నది జగన్ టార్గెట్. అందుకనే ప్రతి నియోజకవర్గంలో కూడా అభ్యర్ధుల ఎంపికను చాలా జాగ్రత్తగా చేస్తున్నది. ఇక ప్రస్తుతానికి వస్తే రాయలసీమలోని మొత్తం 52 నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులతో పాటు జనాలను కూడా తరలించారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా నిర్వహించనంత భారీ స్ధాయిలో జనసమీకరణ చేసింది. పార్టీవర్గాల అంచనా ప్రకారం బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయినట్లే.



250 ఎకరాల సువిశాల మైదానంలో తోపుదుర్తి, పార్టీ దగ్గరుండి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాబోయే ఎన్నికల్లో రైతు రుణమాఫి, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ రు.4 వేలకు పెంచటం లాంటి హామీలను జగన్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం మ్యానిఫెస్టో కాని హామీలను కాని ఇవ్వలేదు.  కాకపోతే హాజరైన జనాలను, వాళ్ళు ఉత్సాహమాన్ని చూసి  ప్రతిపక్షాలకు ఒక్కసారిగా షాక్ కొట్టుంటుంది. మరి జగన్ అనుకున్నట్లుగా అనంతపురంలో క్లీన్ స్వీప్ సాధ్యమవుతుందా ?  ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: