టిడిపి మేనిఫెస్టోను మించి..YCP మేనిఫెస్టో ఉంటుందా..?

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంటే తనకు బైబిల్ ,కురాన్, భగవద్గీత అని తరచూ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.. ఈసారి ఎన్నికలలో వైసీపీ పార్టీ మేనిపోస్టో ఈనెల 18వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. రాయలసీమలో జరుగుతున్న సిద్ధం సభలో ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లాలో రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో పాల్గొని మహాసభలోనే మేనిఫెస్టోను సైతం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి పనులు కూడా శరవేగంగానే జరుగుతున్నాయి. ఇప్పటికే టిడిపి మొదటి మేనిఫెస్టో విడుదల చేయడంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉంటాయని విషయం పైన ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


రాప్తాడు సభలో సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు తన మొదటి మేనిఫెస్టోను విడుదల చేశారని.. 6 గ్యారెంటీలను కూడా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు.ముఖ్యంగా మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను కూడా చంద్రబాబు ఆకట్టుకునే విధంగా తన మొదటి మేనిఫెస్టో విడుదల చేశారు. మొదట ఈ మేనిఫెస్టో సూపర్ సిక్స్ గా నామకరణం చేసి విడుదల చేశారు.. అయితే మరో రెండో విడత మేనిఫెస్టో కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు పొత్తులతో భాగంగా పార్టీలతో కలిసి విడుదల చేసే విధంగా చంద్రబాబు ప్లాన్ చేశారు.


 ఈనెల 18న రాప్తాడులో సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను 98% అమలు చేశామని చెబుతూ ఉండగా ఈసారి మరేన్ని హామీలు ఇస్తారు అంటూ ఆసక్తి రేపేలా కనిపిస్తోంది. అయితే ఈసారి జగన్ సర్కార్ రైతులు ఉద్యోగాలు మహిళలకు లక్ష్యంగానే మేనిఫెస్టో రూపొందించే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది.. రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసే విధంగా..ఉద్యోగులకు కూడా వరాలను కూడా ప్రకటించే అవకాశం తో పాటు వీటితో పాటు బీసీలు ,మైనార్టీ, ఎస్సీ , ఎస్టీల  సంక్షేమాలతో పాటు ఇతర హామీలను కూడా ఇచ్చే విధంగా చోటు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.. మేనిఫెస్టో ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకూడదని అదే ప్లాన్ తో వైసీపీ పార్టీ మేనిఫెస్టోను రూపకల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: