
టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తునే.. జగన్ కావాలనుకుంటున్నారా?
ఈ క్రమంలోనే ఇప్పటికే టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. అయితే అటు బిజెపి మద్దతు కూడా టిడిపికే ఉంది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఇలా టిడిపి, జనసేన, బిజెపి పార్టీల పొత్తు జగన్ పార్టీకి విజయాన్ని అందించబోతుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. ఎందుకంటే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా ఎవరికి వారు పోటీ చేస్తే ఇక ఓట్లను చీల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తద్వారాఎందుకంటే జగన్, చంద్రబాబుకు ఓటు వేయడం ఇష్టం లేని తటస్థ ఓటర్లు జనసేన బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందట. అలాంటప్పుడు టిడిపికి కొన్ని స్థానాలు తక్కువగా వచ్చిన.. ఇక జనసేన, బిజెపి పార్టీలకు వచ్చిన స్థానాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందట. కానీ అటు మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో ఏ పార్టీ గెలిచినా సీఎంగా చంద్రబాబు అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో చంద్రబాబుకు ఓటు వేయడం ఇష్టం లేని వాళ్ళు ఇక జనసేన బీజేపీ లకు సైతం ఓటు వేయకుండా మళ్ళీ వైసిపి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుందని.. వైసిపి అధిష్టానం కూడా అనుకుంటుందట. అందుకే ఇక ఈ మూడు పార్టీల పొత్తు జగన్ విజయానికి కారణమయ్యే అవకాశం కూడా లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.