వాటిపై జగన్ దృష్టి.. టెన్షన్లో వైసీపీ నేతలు?

Purushottham Vinay
వాటిపై జగన్ దృష్టి.. టెన్షన్లో వైసీపీ నేతలు ?

ఆంధ్రప్రదేశ్ లో ఇక కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి.ఇప్పుడు దేశమంతా ఏపీ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సారి ఎవరు గెలుస్తారా అని చర్చ మొదలైంది. ఈసారి తెలుగు దేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేయడం అలాగే షర్మిళ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొని పోటీ చెయ్యడం వంటి అంశాలు ఆసక్తిగా ఉన్నాయి.ఇక రెండోసారి అధికారం దక్కించుకోవడంతో పాటు అత్యధికంగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వైసీపీ దృష్టి పెట్టింది.ఒకవైపు సిద్ధం సభలు అలాగే ఇంకోవైపు వ్యూహాలు రచిస్తున్న వైసీపీ అధిష్టానం, ఇన్‌చార్జ్‌ల నియామకంపై వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 17 ఎంపీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లను మార్చడం జరిగింది. అయితే 6 పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌ల నియామకంపై కసరత్తులు జరుగుతున్నాయి. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, ఒంగోలు ఇంకా నంద్యాల స్థానాల ఇన్‌ఛార్జ్‌ల కోసం అధిష్ఠానం అన్వేషణ సాగిస్తోంది. 


ఇన్‌ఛార్జ్‌గా నియమించే వ్యక్తి బలాబలాలు అలాగే సామాజిక సమీకరణాలు అన్నిటినీ ఇందు కోసం పరిశీలిస్తున్నారు.ఇక ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ హైకమాండ్‌ ఇప్పటి దాకా ఆరు జాబితాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మార్పుల్లో భాగంగా 17 ఎంపీ, 64 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చడం జరిగింది. అయితే ఇంకా 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటితో కడప, రాజంపేట స్థానాలను సిట్టింగ్‌లనే బరిలోకి దించే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.అయితే, ఏడో జాబితా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఈ జాబితాలో ఎన్నో మార్పులుంటాయని.. వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల్లో టెన్షన్ అనేది మొదలైంది. ఈ సీటు ఎవరికి దక్కుతుంది..? ఎవరికి ఈ సారి దక్కదు అనే చర్చ కూడా మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: