వైరల్: నాగబాబుని ఏకిపారేస్తున్న నేటిజన్స్.. ఇప్పుడు ఎలా తొక్కలో చెప్పండి..?
ఇప్పుడు తాజాగా గత ఎన్నికల సమయంలో జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు నా ఇష్టం అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని సైతం షేర్ చేశారు. ఆ వీడియో టిడిపి పార్టీని ట్రోల్ చేసినట్లుగా ఒక వీడియో వైరల్ గా మారింది. 2019 ఎన్నికల సమయంలో జనసేన ఎలాంటి పార్టీలతో పొత్తుకుదురుచుకోకుండా టిడిపి పార్టీ పైన తెగ విమర్శలు చేసింది.. ప్రస్తుతం ఎన్నికలలో టిడిపి తో పొత్తుకుదురుచుకున్నప్పటికి.. గతంలో షేర్ చేసిన ఒక వీడియోను ఇప్పుడు నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు
ఈ వీడియోలో చిన్నపిల్లలు ఒకరు సైకిల్ నడుపుతూ ఉండగా మరొకరు సైకిల్ కింద పడేసి తొక్కుతూ ఉంటారు.. ఆ సమయంలో నాగబాబు అక్కడికి రాగా పిల్లలు ఏం చేస్తున్నారని అడగగా.. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిదని.. సైకిల్ తొక్కుతున్నానని చెప్పగా.. మరొక పిల్లవాడు ఇలా మాట్లాడుతూ సైకిల్ ని తొక్కితే ఆంధ్రప్రదేశ్ కు మంచిదని సైకిల్ ని తొక్కుతున్న అంకుల్ అని తెలుపుతారు..చివరిగా నాగబాబు ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్తొక్కలి..అదే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే సైకిల్ని తొక్కలి అని చెబుతారు.. ప్రస్తుతం వైరల్ గా మారడంతో నాగబాబుని ఏకిపారేస్తున్నారు.. ఇప్పుడు ఎలా తొక్కలో చెప్పండి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రోజులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి పరిస్థితులను బట్టి ఎవరు అతి చేయకూడదని విధంగా కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. గత ఎన్నికలలో కూడా నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు.