తిరుమలలో రోజాకి బిగ్ షాక్?

Purushottham Vinay
ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలపై గట్టి మాటలతో తీవ్ర విమర్శలు చేసేవారిలో మంత్రి రోజా ఒకరు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో ఆమె పర్యాటక, క్రీడలు ఇంకా సాంస్కృతిక శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.తిరుపతికి దగ్గరలోనే తన నియోజకవర్గం నగరి ఉండటంతో తరచూ ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు.ఈ నేపథ్యంలో తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి రోజాకు ఊహించని షాక్‌ తగిలింది. స్వామివారిని దర్శించుకోవడానికి రోజా తిరుమలకు రాగా అక్కడ అనుకోని సంఘటన చోటు చేసుకుంది.స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం బయటకి వచ్చిన రోజా దగ్గరకి కొందరు మహిళలు తమ ఫోన్లలో ఆమెను ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించారు. అందువల్ల రోజా కూడా శ్రీవారి సేవకుల దుస్తుల్లో ఉన్న మహిళలను చూసి ఆగారు. ఇక రోజాతో ఫొటో కోసం అన్నట్టుగా మహిళంతా ఆమె చుట్టూ చేరారు.ఇంతలో ఆ మహిళల్లో కొంతమంది ''జై అమరావతి'' అంటూ గట్టిగా నినాదాలు చేశారు.ఇంకా అంతేకాకుండా 'జై అమరావతి.. చెప్పండి మేడమ్‌' అని వారు మంత్రిని రోజాను కోరారు. ఈ ఘటనతో అవాక్కైన మంత్రి రోజా.. అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయారు.


ఇక రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన కొంతమంది మహిళలు శ్రీవారి సేవకు వచ్చారని సమాచారం తెలుస్తోంది. వారు రోజాను చూడగానే జై అమరావతి అని నినాదాలు చేశారని అంటున్నారు.రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన కొంతమంది మహిళలు శ్రీవారి సేవకు వచ్చారని సమాచారం తెలుస్తోంది.ఇక వారు రోజాను చూడగానే జై అమరావతి నినాదాలు చేశారని అంటున్నారు.వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్వనిర్వాహక రాజధానిగా వైజాగ్ ని ప్రకటించారు.ఇక విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో స్పందించిన హైకోర్టు మూడు రాజధానుల జీవోలను కొట్టేసింది. ఇక ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది.ఇక ఈ నేపథ్యంలో అమరావతి  రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో అమరావతి నుంచి అరసవల్లి దాకా న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా  రైతులు పాదయాత్రలు కూడా చేపట్టారు. తాజాగా తిరుమలలో జై అమరావతి నినాదాలతో మంత్రి రోజాకు గట్టి షాకిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: