జార్ఖండ్ : ముఖ్యమంత్రిగా కల్పనా సోరెన్ ?

Vijaya


జార్ఖండ్ రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. భూకుంభకోణంలో హేమత్ సోరేన్  ఈడీ విచారణకు హాజరవ్వాల్సుంది. అయితే అరెస్టుకు భయపడి 30 గంటలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సుదీర్ఘ హైడ్ అవుట్ తర్వాత రాంచిలో హేమంత్ ప్రత్యక్షమయ్యారు. ఇప్పటికే ముఖ్యమంత్రి మీద మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదయ్యుంది. విచారణకు రావాలని ఈడీ పట్టుబడుతుండగా, విచారణ పేరుతో తనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న భయంతో హేమంత్ తప్పించుకుని తిరిగారు.





తాజా పరిణామాలను చూసిన తర్వాత హేమంత్ అరెస్టు తప్పదనే అందరు అనుకుంటున్నారు. అందుకనే సీఎం కూడా తనపార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ ఎంఎల్ఏలతో రాంచిలో అత్యవసర మీటింగ్ పెట్టుకున్నారు. హడావుడి చూస్తుంటే హేమంత్ భార్య కల్పనా సోరేన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విచారణకు నోటీసులు జారీచేసిన ఈడీ ఉన్నతాధికారులు ఢిల్లీలోని హేమంత్ ఇంటికి వెళ్ళారు.





ఇంట్లో ఉన్న రెండు బీఎండబ్వ్యూ కార్లు, రు. 32 లక్షల నగదుతో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 29వ తేదీ లేదా 31వ తేదీన విచారణకు హాజరుకావాలని హేమంత్ ను ఈడీ కోరింది. అయితే 29వ తేదీన గైర్హాజరైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో 31వ తేదీన మధ్యాహ్నం రాంచిలోని తన ఇంటికి రావాల్సిందిగా ఈడీ ఉన్నతాధికారులకు హేమంత్ మెయిల్ లో సమాచారం ఇచ్చారు. కాబట్టి బుధవారం మధ్యాహ్నం రాంచిలోని ముఖ్యమంత్రి ఇంటికి చేరుకుంటారు.





రాంచిలోనే హేమంత్ ను విచారించటం లేదా అరెస్టుచేయటం తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే ఎంఎల్ఏలతో అర్జంటు మీటింగ్ ఏర్పాటుచేశారట. హేమంత్ ప్లేసులో కల్పనా సోరేన్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ఎన్డీయే ప్రభుత్వం తనపై కక్షసాధింపులకు దిగినట్లు పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే 12 ఎకరాల మైనింగ్ భూములను తన భార్య కల్పన పేరున లీజుకు తీసుకోమని హేమంత్ కు ఎన్డీయే ప్రభుత్వమే చెప్పిందా ?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: