అమరావతి : జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?

Vijaya




రాబోయే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహంతోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. తాజాగా మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామాతో జగన్ వ్యూహంపై చర్చ మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఓసీ సీట్లలో బీసీలను పోటీచేయించటమే.  మంగళగిరిలో బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రెడ్డి, ముస్లిం, కాపు, కమ్మ తదితర సామాజికవర్గం ఓట్లు కూడా ఉన్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఆళ్ళకి కాకుండా ఒక బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. అలాగే గాజువాకలో కూడా దేవాన్ రెడ్డి స్ధానంలో వరికూటి రామచంద్రయాదవ్ ను ఇన్చార్జిగా నియమించారు. ప్రస్తుతం 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చారు.



దీనికి కారణం ఏమిటంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని గతంలోనే ఆళ్ళ నిర్ణయించుకున్నారు. అయితే అప్పట్లో ఏదో మాటవరసకు అన్నారని అందరు అనుకున్నారు. తర్వాత ఏమి జరిగిందో తెలీదుకానీ ఇపుడు సడెన్ గా ఎంఎల్ఏ పదవితో పాటు పార్టీకి కూడా ఆళ్ళ రాజీనామా చేసేశారు. అసలు విషయమంతా ఇక్కడే ఉందని పార్టీవర్గాల టాక్. అదేమిటంటే ఆళ్ళ స్ధానంలో బీసీ నేత ప్రత్యేకించి చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవి లేదా కోండ్రు కమలకు టికెట్ ఇవ్వబోతున్నారట.



పార్టీ వర్గాల సమాచారం అయితే గంజికి టికెట్ వచ్చేందుకే ఎక్కువ అవకాశాలున్నాయట. ఆళ్ళ రాజీనామా తర్వాత గంజి, మురుగుడు ఇద్దరినీ జగన్ పిలిపించుకుని గంజిని ఇన్చార్జిగా ప్రకటించారు. ఇపుడు విషయం ఏమిటంటే రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సదరు రెడ్డిని తప్పించి బీసీ నేతకు జగన్ టికెట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం చేసుకుంటారు. ఇప్పటికే బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్టని జగన్ పదేపదే చెబుతున్నారు. దాన్ని జగన్ నిజం చేసినట్లు మంత్రులు, వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటారు.



రెడ్డి ఎంఎల్ఏని పక్కనపెట్టి బీసీ నేతకు జగన్ టికెట్ ఇవ్వబోతున్నట్లే కమ్మ ఎంఎల్ఏని పక్కనపెట్టి బీసీ నేతకు చంద్రబాబునాయుడు టికెట్ ఇవ్వగలరా అని చాలెంజ్ చేస్తారు. అప్పుడు చంద్రబాబు లేదా తమ్ముళ్ళు ఏమి సమాధానం చెబుతారో చూడాలి. మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో బీసీ సామాజికవర్గం ఓట్లకోసం జగన్ మాస్టర్ ప్లానే వేసినట్లున్నారు. మంగళగిరి లాంటి మరో రెండు మూడు సీట్లలో సిట్టింగులను కాదని బీసీలకు జగన్ టికెట్లు ప్రకటిస్తే దాని ఒత్తిడి చంద్రబాబు మీద పెరిగిపోవటం ఖాయం.  మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: