అక్కడ వరల్డ్ కప్ పోయింది.. ఇక్కడ అధికారం పోయింది?
అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ప్రజలు బిఆర్ఎస్ వైపు నిలవలేదు. ఎందుకో ప్రజల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల మనసులు గెలుచుకోలేకపోయాయ్. దీంతో ఎన్నికలలో మరో పార్టీ వైపే ప్రజలందరూ మొగ్గుచూపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కాకుండా మొదటిసారి మరో పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలలో ప్రభంజనం సృష్టించి 64 స్థానాల్లో ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో.. ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా ప్రస్తుతం తెర మీదికి వస్తూ ఉన్నాయి.
ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయం లో.. ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు గెలవడం ఖాయమని అచ్చం ఇలాగే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ లో హ్యాట్రిక్ కొట్టడం పక్క అంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే వరల్డ్ కప్ లో అంచనాలను తారుమారు చేస్తూ టీమిండియా ఓడి పోయింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విషయం లో కూడా ఇదే జరిగింది. చాలా మంది అంచనాలను తారుమారు చేస్తూ.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీంతో బిఆర్ఎస్ పార్టీ అధికారం దక్కించుకోవడం కాదు ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.