అమరావతి : ఇందుకనే ఇది ఎల్లోమీడియా అయ్యిందా ?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదచల్లటమే ఎల్లోమీడియా టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ తప్పులను జనాలకు ఎత్తిచూపిస్తే అందులో తప్పుపట్టాల్సింది లేదు. ఉన్నది ఉన్నట్లు రాసినపుడు దాన్ని మీడియా అనే అంటారు. కానీ ప్రభుత్వంపై బురదచల్లటమే ధ్యేయంగా ప్రతిరోజు వ్యతిరేకంగా తప్పుడు రాతలు రాస్తుంటేనే ఎల్లోమీడియా అనంటారు. తాజాగా ఎల్లోమీడియాలో చంద్రబాబునాయుడుకు రెగ్యులర్ బెయిల్ వార్తను బ్యానర్ హెడ్డింగుగా ఇచ్చింది. ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే దాని పక్కనే ఒక కార్టూన్ అచ్చేసింది.
అందులో టూరిజం డిపార్ట్ మెంటు గైడ్ పర్యాటకులతో ఒక బిల్డింగును చూపిస్తు ‘ఆ కొత్తగా అవతరించిన రాజసౌధం దేశంలోనే అధిక అప్పుల భారం గల రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభువు ఆవాసం’ అని చెబుతుంటాడు. రుషికొండ మీద నిర్మిస్తున్నది ముఖ్యమంత్రి క్యాంపు ఆపీసు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసంటే అది ప్రభుత్వ భవనమే కానీ జగన్మోహన్ రెడ్డి సొంత భవనం కాదు. రేపటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే జగన్ స్ధానంలో ముఖ్యమంత్రయ్యే నేత అందులోనే కంటిన్యు అవదలచుకుంటే అవ్వచ్చు.
కాబట్టి భవనాలన్నీ ప్రభుత్వానివే కానీ జగన్ సొంతంకాదన్న విషయం ఎల్లోమీడియాకు బాగా తెలుసు. అయినా జగన్ మీద తన కసిని తప్పుడు వార్తలు, కార్టూన్ల రూపంలో తీర్చుకుంటోంది. అలాగే దేశంలో ఏపీపైనే అధిక అప్పుల భారమని చెప్పింది. ఇదికూడా తప్పే. ఎందుకంటే కేంద్రం ప్రకటించిన రాష్ట్రాల అప్పుల జాబితాలో ఏపీకన్నా ముందున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలు అప్పుల్లో ఏపీని మించిపోయాయి.
కాబట్టి ఏ రకంగా చూసినా కార్టూన్ తప్పు అలాగే అందులో చెప్పిన విషయం కూడా తప్పే. తానిస్తున్న వార్తలు, కథనాలు, వేస్తున్న కార్టూన్ తప్పని ఎల్లోమీడియాకు బాగా తెలుసు. ఏపీలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని చెప్పింది. దేశంలో ఎక్కడా లేనంత దరలు ఏపీలో ఉన్నట్లు కథనం రాసింది. అయితే ఏపీలో నిత్యావసరాల ధరలు కొన్ని రాష్ట్రాలతో పోల్చితే తక్కువగానే ఉన్నట్లు కేంద్రమే చెప్పింది. ప్రతిరోజు ఇలాంటి తప్పుడు రాతలు రాస్తోంది కాబట్టే దీన్ని జనాలు కూడా ఎల్లోమీడియా అంటున్నారు.