అమరావతి : టీడీపీ సీనియర్లలో కొత్త టెన్షన్ ?

frame అమరావతి : టీడీపీ సీనియర్లలో కొత్త టెన్షన్ ?

Vijaya


సీనియర్ తమ్ముళ్ళు కొందరిలో కొత్త టెన్షన్ మొదలైందట. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో నియోజకవర్గం మారాల్సి రావటమో లేకపోతే అసలు మొత్తానికి పోటీకే దూరంగా ఉండటమో తప్పదనే సంకేతాలు మొదలైనట్లు సమాచారం. జనసేనతో పొత్తు కారణంగానే కొందరు సీనియర్లకు ఇలాంటి సమస్యలు తప్పేట్లు లేదని పార్టీవర్గాల సమాచారం. రాబోయే ఎన్నికల్లో పోటీ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక జాబితాను చంద్రబాబుకు ఇచ్చారట.



దానిప్రకారం సుమారు 30 నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతున్నదట. ఇందులో ప్రజారాజ్యంలో గెలిచిన సీట్లు+2019 ఎన్నికల్లో జనసేన ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాలున్నాయట. ఆ జాబితాలో సీనియర్ తమ్ముళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయట. చంద్రబాబు అరెస్టు, బెయిల్ మళ్ళీ లొంగిపోవాల్సి రావటం  నేపధ్యంలో జనసేన జాబితాను కాదనే పరిస్ధితి లేదు. ఈ జాబితాలో రాజమండ్రి రూరల్, కాకినాడ, భీమవరం, గాజువాక, రాజోలు, తిరుపతి, కైకలూరు, గిద్దలూరు, ఆళ్ళగడ్డ, చిత్తూరు, అమలాపురం, పెందుర్తి, తెనాలి, పీ గన్నవరం లాంటి నియోజకవర్గాలున్నట్లు సమాచారం. నిజానికి ఇవన్నీ టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలే.



జనసేన జాబితాను కాదనే పరిస్దితి లేదుకాబట్టి కొన్నిచోట్ల సీనియర్లకు స్ధానచలనం తప్పదని, మరికొందరు సీనియర్లు టికెట్లను త్యాగం చేయకతప్పదని చంద్రబాబు సంకేతాలు పంపుతున్నారట. రాజమండ్రి రూరల్లో సిట్టింగ్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బలంగా ఉన్నారు. అయినా సీటును జనసేన నేత కందుల దుర్గేష్ కోసం వదులుకోక తప్పేట్లు లేదట. భీమవరం, గాజువకలో పవనే పోటీచేసే అవకాశం ఉందంటున్నారు కాబట్టి రెండు నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు పోటీనుండి తప్పుకోవాల్సిందే.



తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎంత బలమైన నేతైనా జనసేన నేత నాదెండ్ల మనోహర్ కోసం టికెట్ వదులుకోవాల్సిందే. అందుకు బదులుగా ఆలపాటిని గుంటూరు ఎంపీగా పోటీచేయించే అవకాశాలున్నాయంటున్నారు. ఇదే పద్దతిలో అవకాశముంటే కొందరిని వేరే నియోజకవర్గాల్లో పోటీచేయించే అవకాశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారట. కుదరకపోతే టికెట్ త్యాగంచేసి గెలుపుకు కృషిచేయాలనే సంకేతాలను పంపుతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. జనసేన కారణంగా ఎవరికి స్ధానచలనం, ఎవరు త్యాగాలు చేయాల్సొస్తుందో తెలీక తమ్ముళ్ళల్లో టెన్షన్ మొదలైందని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: