గోదావరి : చంద్రబాబు ‘లేఖ’ వివాదంలో ఇరుక్కున్నారా ?

Vijaya


స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబునాయుడు లేఖ పేరుతో జనాల్లో అయోమయాన్ని సృష్టించారు. జనాలను ఉద్దేశించి చంద్రబాబు లేఖను విడుదల చేశారంటు ఎల్లోమీడియా విపరీతంగా ఊదరగొట్టింది. అయితే జైలు నుండి చంద్రబాబు లేఖను విడుదల చేసే అవకాశాలు ఏమాత్రం లేదు. చంద్రబాబు లేఖ రాయలంటే అందుకు జైలు అధికారుల అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు లేఖ రాయాలంటే అందుకు పేపర్, పెన్ను అందించాల్సింది అధికారులు మాత్రమే.





కాబట్టి జైలు అధికారులు పెన్ను, పేపర్ ఇవ్వకుండా చంద్రబాబు లేఖ రాయలేరు. అలాగే రాసిన లేఖను ముందు జైలు అధికారులు చూడకుండా బయటకు పంపే అవకాశమూలేదు. చంద్రబాబు లేఖలో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి ఆ లేఖను అధికారులు బయటకు పంపే అవకాశంలేదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే చంద్రబాబు తన ఆలోచనలను భువనేశ్వరి, లోకేష్ తో పంచుకుంటే దానికి ఎవరో అక్షర రూపం ఇచ్చి చంద్రబాబు పేరుతో విడుదల చేశారు. దాన్నే చంద్రబాబు లేఖంటు ఎల్లోమీడియా ఊదరగొట్టింది.





ఇక లేఖలోని అంశాలను చూస్తే చంద్రబాబు అవస్తలు అర్ధమవుతోంది. అదేమిటంటే సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి తానే గుర్తుకొస్తానని చంద్రబాబు చెప్పుకోవటం నిజంగా పెద్ద జోకనే చెప్పాలి. ఎందుకంటే సంక్షేమానికి చంద్రబాబు ఆమడదూరంగా ఉంటారు. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రకటించిన ఏ సంక్షేమపథకాన్నీ సంపూర్ణంగా అమలుచేయలేదని అందరికీ తెలుసు. రైతు రుణమాఫీ, డ్వాకా రుణాల మాఫీ, ఎన్టీయార్ క్యాంటిన్లు, నిరుద్యోగ భృతి, ఆరోగ్య శ్రీ ఇలా ఏ పథకం తీసుకున్నా అన్నింటినీ దెబ్బకొట్టేశారు.





ఇలాంటి చంద్రబాబు కూడా సంక్షేమపథకాలంటే జనాలకు తానే గుర్తుకొస్తానని ప్రకటించుకోవటమే పెద్ద జోక్. పైగా జనాలను భయపడవద్దని చెబుతున్నారు. కేసులతో, జైలు భయపడుతున్నదే చంద్రబాబు. తనలోని భయాన్ని కవరింగ్ చేసుకుంటు జనాలకు ధైర్యం చెప్పటం భలే విడ్డూరంగా ఉంది. జైలులో ఉన్న చంద్రబాబు భయం బయటున్న భువనేశ్వరి, లోకేష్ మొహాల్లో స్పష్టంగా కనబడుతోంది. చంద్రబాబు కుటుంబసభ్యులకే గ్యారెంటీ లేని నేపధ్యంలో వీళ్ళు జనాల భవిష్యత్తుకు గ్యాంరెటీ అనటమే విచిత్రంగా ఉంది.  ఇంతోటిదానికి చెడుపై మంచి గెలుస్తుందని, చెడు గెలుపు తాత్కాలికమే అని సుద్దులు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: