అమరావతి : పవన్ ముసుగు తీసేశారా ?

Vijaya



ఇంతకాలం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసుకున్న ముసుగును తీసేశారు. చాలాకాలంగా ముసుగులో గుద్దులాట లాగ టీడీపీ,జనసేన బంధం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా ముసుగు తీసేసి బయటకు రావటం సంతోషించాల్సిన విషయమే. అయినా పవన్ మాత్రం ఎంతకాలమని ముసుగేసుకుని చంద్రబాబుతో నడుస్తారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి జైలులో  రిమాండులో ఉన్న చంద్రబాబును కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు టీడీపీ, జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు.





అయితే తమ మిత్రపక్షం బీజేపీ నేతలు ఏమనుకుంటారో అన్న అనుమానం వచ్చినట్లుంది. అందుకనే తమతో కలిసి నడవాలని బీజేపీ పెద్దలను కూడా అడుగుతానని ఒక మాటవేశారు. అయితే పవన్ కు బాగా తెలుసు టీడీపీతో బీజేపీ చేతులు కలపటానికి ఇష్టపడటంలేదని. ఎందుకంటే చాలాకాలంగా పవన్ ఎంతప్రయత్నిస్తున్నా టీడీపీతో బీజేపీ చేతులు కలపటంలేదు. అందుకనే ఫైనల్ గా పవన్ డిసైడ్ అయిపోయినట్లున్నారు టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకరించకపోయినా తానైతే కలవాలని.





అందుకనే ఇంత ఓపెన్ గా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళతామని ధైర్యంగా ప్రకటించారు. ఒకవైపు బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో కలిసి పవన్ నడుస్తున్న విషయం అందరు చూస్తున్నదే. స్ధానిక సంస్ధల ఎన్నికలు, ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీతో పవన్ కలిశారు కానీ బీజేపీతో కలవలేదు. ఏదో రోజు పవన్ తమను వదిలేసి టీడీపీతో చేతులు కలుపుతారని కమలనాదులు అనుమానిస్తున్నదే.





ఆ విషయాన్నే  తాజాగా పవన్ ప్రకటించారు.  ఢిల్లీకి వెళ్ళినపుడు ఫైనల్ గా నరేంద్రమోడీ, అమిత్ షా ను కలిసేందుకు ప్రయత్నిస్తారు. కలిస్తే జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదులు చేసి టీడీపీతో పొత్తుకు ప్రయత్నిస్తారు. సాధ్యంకాకపోతే వచ్చేసి డైరెక్టుగా టీడీపీతో చేతులు కలిపేస్తారంతే. ఇంతకాలం బీజేపీని కాదని చంద్రబాబుతో కలిస్తే ఏమవుతుందో అని భయపడినట్లున్నారు. అయితే చంద్రబాబు రిమాండ్ తర్వాత బహుశా బీజేపీ పెద్దల మనోగతం అర్ధమైనట్లుంది. ఎప్పటికీ టీడీపీతో బీజేపీ కలవదని ఫైనల్ చేసుకున్న తర్వాతే ఏదైతే అదయ్యిందని తాను చంద్రబాబుతో చేతులు కలిపేందుకు రెడీ అయిపోయారు. మరి ఢిల్లీ పర్యటనలో ఏమి జరుగుతోందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: