వారికోసం గుడ్ న్యూస్ ప్రకటించిన జగన్ ప్రభుత్వం....!!

murali krishna
ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ ఆసరా పథకం ద్వారా ఎంతో మంది ప్రజలకు సైతం పెన్షన్ ని అందుబాటు చేస్తూ ఉన్నది వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా మరొకసారి వారికి గుడ్ న్యూస్ చెప్పింది.ఇప్పటివరకు పెన్షన్ రాలేదని ఇబ్బంది పడుతున్న వారికి ఏకంగా ఒక శుభవార్తను అందించింది.. పెన్షన్కు అర్హత ఉండి కూడా ఇప్పటివరకు అందుకొని వారు ఎవరైనా ఉంటే జగనన్న సురక్ష పథకం ద్వారా గుర్తించిన ప్రభుత్వం వారికి ఏకంగా లబ్ధిదారుల జాబితాలో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి వారి కోసమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పింఛన్ పంపిణీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు ఈసారి పెన్షన్ చెల్లింపు తేదీని కూడా పొడిగించే అవకాశం ఉన్నది.ఆంధ్రప్రదేశ్లో ఆసరా పథకం కింద ప్రతినెల పెన్షన్ దారులకు ఒకటవ తేదీ నుంచి 5వ తేదీ లోపల పూర్తి చేస్తూ ఉండేవారు.. ముఖ్యంగా వాలంటరీలు స్వయంగా పెన్షన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి డబ్బులను అందించేవారు.. అయితే ఈసారి కొత్తగా లబ్ధిదారులు చేరిక వల్ల అప్డేట్ చేయడం వంటి కారణాల చేత పెన్షన్ చెల్లింపు తేదీ 7వ తేదీ వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంకా ఆలస్యం అయితే 10వ తేదీ వరకు కూడా పెంచుతూ ఉండేందుకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

వైసిపి ప్రభుత్వం గత ఎడాది నవంబర్ నుంచి ఏడాది జూన్ వరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి వారికి పెన్షన్ మంజూరు అయితే వారిని పెన్షన్ జాబితాలో చేర్చే ప్రక్రియ కూడా చేపట్టింది. అందుకోసం కొన్ని నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యం చోటు చేసుకుంటుందని అందుకే ఈనెల 10వ తేదీ వరకు పెన్షన్ చెల్లించేందుకు సెర్ఫ్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఏపీ ప్రభుత్వం తెలుపుతోంది.ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ ఆసరా పథకం కింద నెలకు రూ.2750 పెన్షన్ చెల్లిస్తున్నారు.. ఈ మొత్తం వచ్చే ఏడాదికల్లా 3 వేలకు పెంచబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలుపుతోంది.. ఈ నేపథ్యంలోని ఎవరైనా అర్హత ఉండి కూడా పెన్షన్ పొందని వారు ఈ పథకంలో చేరవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: