అమరావతి : ఎల్లోమీడియాది పిచ్చి లాజిక్కులేనా ?

Vijaya



మాయాబజార్ సినిమా  పెళ్ళిసీన్లో పెళ్ళికొడుకు ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుంటాడు. అప్పుడు శకునిమామ కల్పించుకుని పెళ్ళికొడుక్కి ఏదో దుష్టశక్తి ఆవహించినట్లుంది అందుకనే ఇలా మాట్లాడుతున్నాడు అని చెబుతాడు. ఇపుడు ఎల్లోమీడియా వ్యవహారం కూడా అలాగే తయారైంది. జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక బురదచల్లాలి. కానీ ఏమిచల్లాలో తెలీదు. అందుకని తమ బుర్రలో ఏదో ఒకటి ఆలోచించుకుని అదే నిజమ్మన్నట్లుగా రాసి అచ్చేస్తున్నారు. తాజాగా అచ్చేసి వీకెండ్ కామెంట్ అచ్చంగా అలాగే ఉంది.





ఇంతకీ అందులో ఏముందంటే ‘కాంగ్రెస్ నూ కమ్మిన జగన్నాయ’ అనే హెడ్డింగుతో ఒక పిచ్చి కథనాన్ని వండి వార్చేశారు. వీటికి లాజిక్కులుండవు. ఎందుకంటే జగన్ కు వ్యతిరేకంగా ఏదో ఒకటి రాయాలి అన్న అజెండా పెట్టుకున్నపుడు లాజిక్కులు ఎక్కడ దొరుకుతాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ తన ధనబలంతో కాంగ్రెస్ ను కూడా మాయచేశారట. రాబోయే ఎన్నికల్లో షర్మిల గనుక ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించారట.





అందుకనే కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి రాబోయే ఎన్నికల్లో అవసరమైతే తన ఎంపీలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తారని హామీ ఇచ్చారట. ధనబలంతో కాంగ్రెస్ లోని కీలక నేతలను బుట్టలో వేసుకున్నారట. అందుకనే ‘సోనియా, రాహుల్ కూడా మీ అన్నా చెల్లెళ్ళకు గొడవలు పెట్టామని చెడ్డపేరు తమకు వద్ద’ని షర్మిలతో చెప్పేశారట. అంటే షర్మిల ఏపీలో జగన్ను ఢీ కొట్టడానికి సిద్ధమైనా సోనియా, రాహుల్ వద్దని చెప్పేశారట. అసలు షర్మిల ఏపీలో ప్రచారం చేస్తే జగన్ కు వచ్చే నష్టంఏమిటో ఎల్లోమీడియాకే తెలియాలి. తెలంగాణాలో పాదయాత్ర చేస్తున్నపుడు రాజన్న పాలనను తీసుకొస్తాననే కదా షర్మిల చెబుతున్నారు. మరా రాజన్న కొడుకుగా జగన్ అదే పనిచేస్తున్నపుడు జనాలు ఇక షర్మిలను ఎందుకు పట్టించుకుంటారు ?





తనను వేధించటమే లక్ష్యంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని సోనియా, రాహుల్ పై  జగన్ మండిపోతన్న విషయం తెలిసిందే. అలాంటిది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కే తమ ఎంపీలు మద్దతు ఇస్తారని జగన్ ప్రతిపాదించటం, అందుకు సోనియా, రాహుల్ అంగీకరిచారని రాయటం చాలా విచిత్రంగా ఉంది.  కాంగ్రెస్ కు జగన్ దగ్గరవుతున్నారని రాయటం ద్వారా నరేంద్రమోడీలో జగన్ పై అనుమానపు భీజాలు నాటడమే టార్గెట్ గా ఉంది. అందుకనే ఇలాంటి పనికిమాలిన రాతలన్నీ రాస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: