ఉత్తరాంధ్ర : జగన్ దారికొచ్చిన పవన్ ?
గడచిన ఆరురోజులుగా జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో వారాహియాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డిని గ్రేట్ అని అంగీకరించినట్లే అనిపిస్తోంది. ఇంతకీ పవన్ ఏమన్నారంటే రాబోయే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే సంక్షేమపథకాలు ఆగిపోతాయని భయపడాల్సిన అవసరం లేదట. జగన్ ఇపుడు అమలుచేస్తున్న పథకాలకన్నా మరిన్ని ఎక్కువ పథకాలు అమలుచేస్తామని పవన్ హామీఇచ్చారు.
తన తాజా ప్రకటన లేదా హామీలోనే జగన్ గొప్పతనాన్ని పవన్ అంగీకరించినట్లయ్యింది. ఇప్పటికన్నా మరిం ఎక్కువగా సంక్షేమపథకాలు అందిస్తామని అంటే అర్ధమేంటి ? ఇపుడు అర్హులైన పేదలందరికీ జగన్ సంక్షేమపథకాలు అందిస్తున్నారని ఒప్పుకున్నట్లే కదా. సంక్షేమపథకాలు అమలుచేయకుండా రాష్ట్రం ముందుకు నడవదని అంగీకరించినట్లే కదా. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల రూపంలో జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని పవన్ అంగీకరించినట్లే.
ఇక ఫైనల్ గా సంక్షేమపథకాలను అమలుచేయటం ద్వారా జగన్ శ్రీలంక లాగ ఏపీని సంక్షోభంలో కూరుకుపోయేట్లు చేస్తున్నాడని చేసిన గోలంతా తప్పేనని ఒప్పుకున్నట్లే కదా. సంక్షేమపథకాలు అమలుచేయకుండా ఏ రాష్ట్రంలో కూడా పాలన సాధ్యంకాదు. కాకపోతే అమలుచేస్తున్న పథకాలు నిజమైన అర్హులకు అందుతున్నదా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. అర్హులకు అందిస్తు అనర్హులను ఏరేస్తుండాలి. అప్పుడే సంక్షేమానికి చేస్తున్న ఖర్చు సార్ధకమవుతుంది. అలాకాకుండా జగన్ మీద గుడ్డి వ్యతిరేకతతో సంక్షేమపథకాలను వ్యతిరేకిస్తే నష్టపోయేది వ్యతిరేకించే వాళ్ళే అనటంలో సందేహంలేదు.
మొత్తానికి ఇంతకాలానికి జగన్ దారిలోకి పవన్ వచ్చేశారు. ఎంతగా వచ్చారంటే ఇపుడు జగన్ అమలుచేస్తున్న పథకాలకన్నా మరింత ఎక్కువ పథకాలు అమలుచేస్తామని హామీ ఇచ్చేటంతగా. అగ్రరాజ్యమని ప్రచారంలో ఉన్న అమెరికాలోనే సంక్షేమపథకాలు అమలవుతున్నాయి. అలాంటిది అభివృద్ధిలో ప్రయాణిస్తున్న మనదేశానికి సంక్షేమపథకాలు ఇంకెంత అవసరం ? మనదేశంలో లెక్కలు తీస్తే సుమారు 70 శాతం పేదలు, దిగువ మధ్యతరగతి జనాలే ఉంటారేమో. కాబట్టి సంక్షేమపథకాలు అమలుచేయటం మస్ట్ అని పవన్ ఇంతకాలానికైనా గుర్తించారు.