రాయలసీమ : సునీత, షర్మిలకు చంద్రబాబు మద్దతా ?

Vijaya




రాయలసీమ పర్యటనలో చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొదట కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు తర్వాత కడప జిల్లా పులివెందులలో పర్యటించారు. ఇక్కడ పెద్ద రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి, వైఎస్ సునీత, షర్మిల అంశాలను వ్యూహాత్మకంగా ప్రస్తావించారు.  దీనివల్ల టీడీపీకి జరిగే లాభం ఏమిటన్న విషయాలను పక్కనపెట్టేస్తే పులివెందులకు వచ్చి జనాలతో అమరావతికి జై కొట్టించటం గమనార్హం. చంద్రబాబు రోడ్డుషో అంటే హాజరయ్యేది అంతా టీడీపీ నేతలు, క్యాడరే అయినా ఎంతోకొంతమంది లోకల్ జనాలు కూడా ఉంటారు కదా.





పదేపదే అమరావతే రాజదానిగా ఉండాలని జనాలతో చెప్పించారు. ఇక్కడ పులివెందుల అని నొక్కిచెప్పటం ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టే. ఒకవైపు జగన్ మూడు రాజధానులకు జై కొట్టారు. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని లెజిస్టేచర్ క్యాపిటల్ గా జగన్ ప్రతిపాదించారు. వచ్చేనెల నుండి తాను వైజాగ్ లోనే కాపురం ఉండబోతున్నట్లు జగన్ ఇప్పటికే ప్రకటించారు.





పులివెందుల ఎంఎల్ఏగా గెలిచి ముఖ్యమంత్రయిన జగన్ నియోజకవర్గంలోనే అమరావతికి జై కొట్టించాలన్నది చంద్రబాబు ఆలోచన. అంటే జగన్ సొంత నియోజకవర్గంలోనే జనాలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికే కట్టుబడి ఉన్నట్లు హైలైట్ చేయాలన్నది చంద్రబాబు వ్యూహం. తన వ్యూహం అయితే వర్కవుటైంది. ఎందుకంటే చంద్రబాబుకు అనుకూలంగా  లేదా జగన్ కు వ్యతిరేకంగా ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా దాన్ని పెద్ద కొండంత సైజులో హైలైట్ చేయటానికి ఎల్లోమీడియా కాచుకుని కూర్చునుంటుంది.





ఇక వైఎస్ సునీత విషయం సరేసరి. సునీతను పులివెందుల పులిగా వర్ణించారు. వివేకానందరెడ్డి, సునీతను కావాలనే చంద్రబాబు అభినందించారు. బాబాయ్ ను అబ్బాయే హత్యచేయించి చాలా డ్రామాలాడినట్లు పదేపదే ఆరోపించారు. వచ్చేఎన్నికల్లో పులివుందుల సత్తా ఏమిటో చూపించాలన్నారు. బహుశా సునీతకు టీడీపీ టికెట్ ఇస్తారేమో. వైఎస్ షర్మిలకు ఆస్తిలో సగభాగం ఇవ్వకుండా తరిమేసినట్లు ఆరోపించారు. అప్పటికి తన తండ్రి ఆస్తిలో చంద్రబాబు అక్క, చెల్లెళ్ళకు సమానభాగం పంచి ఇచ్చినట్లు. మొత్తంమీద పులివెందుల రోడ్డుషో సక్సెస్ అయినట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: