అమరావతి : బీజేపీ-కేంద్రం మధ్యలో జగన్

Vijaya


ఏపీలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఇంత విచిత్రమైన రాజకీయాలు ఏపీలో తప్ప దేశంలో మరే రాష్ట్రంలోను ఉండవేమో. రాజకీయాలు రాష్ట్రంలో ఇంత అధ్వాన్నంగా తయారవ్వటానికి మీడియానే ప్రధాన కారణమనిపిస్తోంది. ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియా యాజమాన్యాలకు జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న ధ్వేషం కారణంగా రాజకీయాలు అథమస్ధాయికి పడిపోయాయి. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే ప్రతిపక్షాల్లో కూడా ఏపీ ప్రభుత్వం వర్సెస్ బీజేపీ మరీ విచిత్రంగా ఉంది.





ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీ నేతలు ప్రతిరోజు జగన్ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, పెట్టుబడులు రావటంలేదు, పరిశ్రమలు వెళిపోతున్నాయి, ఉద్యోగ, ఉపాధి కల్పన లేదు. నేరాలు కంట్రోల్ చేయలేని స్ధాయికి చేరుకున్నాయని కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పదేపదే విరుచుకుపడుతున్నారు.





ఇదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, విదేశీ పెట్టుబడుల సాధనలో రికార్డు సృష్టించిందని, పేదరికం కూడా 11.7 శాతం నుండి 6.06 శాతానికి తగ్గిందని, ఉద్యోగాల కల్పనలో ఏపీ బాగానే ఉందని కేంద్రం కితాబిస్తోంది. జగన్ అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, పాలనా సంస్కరణలను కేంద్రప్రభుత్వం, నీతి అయోగ్ అభినందిస్తున్నాయి. ఏపీలో అమలవుతున్న కొన్ని పథకాలను, ఉద్యోగులకు వర్తింపచేయాని అనుకుంటున్న గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం దేశమంతా అమలు చేయాలని కసరత్తు చేస్తోంది. విద్యా వ్యవస్ధను బాగుచేయటం కోసం అమలవుతున్న నాడు-నేడు,  గ్రామాలకు వైద్యాన్ని అందించేందుకు అమలుచేస్తున్న విలేజ్ క్లినిక్కుల కాన్సెప్టును ప్రపంచబ్యాంకు కూడా అభినందించింది.





ఒకవైపు పార్టీగా బీజేపీ జగన్ పాలనపై దుమ్మెత్తిపోస్తుంటే కేంద్రప్రభుత్వం ఏమో బ్రహ్మాండమంటోంది. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రెవిన్యు లోటు రు. 10 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు రీ ఎంబర్స్ మెంట్ రు. 12,911 కోట్లు విడుదలచేసింది. చిన్నా చితకా బకాయిలను కూడా ఇస్తోంది. మొత్తానికి ఈరోజుకైతే కేంద్రప్రభుత్వం జగన్ చెప్పినట్లే కాస్త అటుఇటుగా నడుకుంటోందనే అనుకోవాలి. తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి మంచి ప్రాజెక్టులను, మరిన్ని నిధులను తెస్తే సంతోషమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: