అమరావతి : మెంటల్ గా ప్రిపేరైపోయారా ?

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పర్యటించినా ఒకటే మాట రిపీటెడ్ గా చెబుతున్నారు. అదేమిటంటే తనను ఓడించినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు. ఓడిపోయినా సరే తన పోరాటం ఆగదు అంటు చెబుతున్నారు. మీటింగులకు వచ్చిన వాళ్ళంతా తనకు ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం కూడా లేదని పదేపదే అంటున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో కూడా గెలుస్తాననే నమ్మకం పవన్లో ఉన్నట్లు లేదు. ఇక్కడే పవన్ చిన్నలాజిక్ మిస్సవుతున్నారు.





యుద్ధరంగంలోకి దిగేవాడు ప్రత్యర్ధిని గెలవాలనే దిగుతాడు కానీ ఓడిపోవాలని దిగడు. అసలు యుద్ధంలోకి దిగేముందే ప్రత్యర్ధి బలమేంటి, తన బలం ఏమిటనే విషయమై సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే యుద్ధంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. తన బలమేంటో తెలీకుండానే, ప్రత్యర్ధి బలమేంటో కళ్ళకు కనిపిస్తున్నా కూడా పదేపదే చాలెంజులు చేస్తున్నారంటే ఏమనుకోవాలి. ఇపుడు పవన్ పరిస్ధితి ఇలాగే తయారైంది. జగన్మోహన్ రెడ్డంటే విపరీతమైన ధ్వేషం, కసి నిండిపోయింది.





వచ్చేఎన్నికల్లో వైసీపీని  ఎలాగైనా ఓడించాలని కసి పెరిగిపోతోంది. అయితే అందుకు మార్గం మాత్రం కనిపించటంలేదు. అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్లో జగన్ పైన నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు.  కాకినాడ సభలో మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో కూడా గెలుస్తాననే నమ్మకం తనకు లేదన్నారు. సభకు వచ్చిన వాళ్ళందరు తనకు ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం లేదన్నారు. నిజానికి ఎవరూ ఇలాగ మాట్లాడరు. ఓడిపోతామని తెలిసినా కూడా చివరి నిముషంవరకు గెలుస్తామనే చెబుతారు. దీనికి చంద్రబాబునాయుడే ఉదాహరణ.





పోటీచేయబోతున్న పవనే తన గెలుపుపై నమ్మకం లేదని అన్నపుడు ఓట్లేసేవాళ్ళు మాత్రం ఎందుకు వేస్తారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకని పవన్ కు ఓట్లేద్దామని అనుకున్న వాళ్ళు కూడా మానేస్తే రెండో ఎన్నికల్లో కూడా ఓడిపోవటం ఖాయం. కాకినాడలో మొదలుపెట్టిన ఓటమి పాట అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, నరసాపురంలో కూడా కంటిన్యుచేశారు. తాజాగా ఏలూరు సభలో కూడా మళ్ళీ ఇదే వినిపించారు.  అంటే ఓటమికి ముందే పవన్ మానసికంగా సిద్ధపడినట్లు అనుమానంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: