హైదరాబాద్ : కేసీయార్ అంటే మోడీ భయపడుతున్నారా ?

Vijaya



నరేంద్రమోడీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది.  మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కేసీయార్+కవిత గురించి మోడీ మాటలు విన్నతర్వాత ఇదే అనుమానం మొదలైంది.  భోపాల్లో మోడీ మాట్లాడుతు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీయార్ కూతురు కవిత ఇరుక్కున్నట్లు ఆరోపించారు. ఇంతకాలం కేసీయార్ తో పాటు కుటుంబాన్ని ఎప్పుడూ ప్రస్తావించని మోడీ ఇపుడు సడెన్ గా కేసీయార్ తో పాటు కవితపైన కూడా ఆరోపణలు చేశారు. కేసీయార్ కూతురు బాగుండాలంటే బీఆర్ఎస్ కు..మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీకి  ఓట్లేయమన్నారు.





ఇక్కడే మోడీ భయం బయటపడుతోంది. ఎలాగంటే మధ్యప్రదేశ్ ఎన్నికలకు బీఆర్ఎస్ కు ఏమిటి సంబంధం ? మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయటంలేదు. అక్కడి ఎన్నికల్లో కేసీయార్, కవిత గురించి మోడీ ఎన్ని ఆరోపణలు చేసిమాత్రం ఏమిటి ఉపయోగం. అక్కడి జనాలకు కేసీయార్, కవిత తెలిసే అవకాశాలూ పెద్దగా లేవు. కేసీయార్, కవిత గురించి మాట్లాడితే తెలంగాణాలో మాట్లాడాలి. లేకపోతే మహారాష్ట్రలో మాట్లాడినా ఏదోలే అనుకోవచ్చు. అంతేకానీ ఎలాంటి సంబంధంలేని మధ్యప్రదేశ్ లో ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది.





ఇక లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కున్నట్లు ఆరోపించారు. నిజంగానే కవిత పాత్రుంటే మరి సీబీఐ, ఈడీలు ఏమిచేస్తున్నాయి ? స్కామ్ లో మిగిలిన వాళ్ళను అరెస్టుచేసినట్లే కవితను ఈడీ ఎందుకు అరెస్టుచేయలేదు ? అరెస్టుచేయటానికి అవసరమైన ఆధారాలు దొరకలేదనే అర్ధమవుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలను ఎంతోమందిని దర్యాప్తుసంస్ధలు అరెస్టుచేసిన విషయం చూస్తున్నదే. అలాంటిది కవితకు వ్యతిరేకంగా ఆధారాలుంటే ఇంతకాలం అరెస్టుచేయకుండా ఈడీ వదిలిపెడుతుందా ?





లిక్కర్ స్కామ్, ఆధారాలు, దర్యాప్తు, అరెస్టును పక్కనపెట్టేద్దాం. అసలు భోపాల్ సభలో కేసీయార్, కవిత ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏమోచ్చింది అన్నదే అర్ధంకావటంలేదు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీయార్ మధ్యప్రదేశ్ లో ప్రచారం చేస్తారని మోడీ అనుమానిస్తున్నారా ? కేసీయార్ ప్రచారం చేయటం ద్వారా బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతాయని భయపడుతున్నారా ? అందుకనే ముందుజాగ్రత్తగా కేసీయార్, కవితపై బురదచల్లే కార్యక్రమం పెట్టుకున్నారా ? అనే సందేహం పెరిగిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: