హైదరాబాద్ : జోగయ్యను వాయించేసిన హైకోర్టు

Vijaya



జగన్మోహన్ రెడ్డి మీదున్న అక్రమ ఆదాయార్జన కేసులను వెంటనే తేల్చేయాలని కోరుతు పిటీషన్ వేసిన మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్యను తెలంగాణా హైకోర్టు ఫుల్లుగా వాయించేసింది. జోగయ్య దాఖలుచేసిన కేసులో పబ్లిక్ న్యూసెన్స్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్టు ఎక్కడా కనబడటంలేదని మండిపోయింది. ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన పిటీషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయద్దని చివాట్లు పెట్టింది.





జగన్ పై దాఖలైన కేసులన్నింటినీ వెంటనే విచారణ జరపాలని, 2024 ఎన్నికలకు ముందే తీర్పుచెప్పాలని జోగయ్య తన పిటీషన్లో డిమాండ్ చేశారు. జోగయ్య ఉద్దేశ్యం ఏమిటంటే అవినీతిపరుడిగా తీర్పుచెప్పి రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా జగన్ను అనర్హుడిగా కోర్టు ప్రకటించాలని.  జగన్ లాంటి అవినీతిపరులు రాజకీయాల్లో ఉండకూడదన్నట్లుగా జోగయ్య తన పిటీషన్లో చెప్పారు. కాబట్టి జగన్ పైన విచారణలో ఉన్న కేసులను వెంటనే  తేల్చేస్తే జగన్ విషయం తేలిపోతుందన్నట్లుగా మాజీ ఎంపీ తన పిటీషన్లో పేర్కొన్నారు.





అయితే జోగయ్యచేసిన పిచ్చిపని ఏమిటంటే కేసులను వెంటనే విచారణ చేయించాలని రాష్ట్రపతికి, సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా ఫిర్యాదుచేశారు. అలా ఫిర్యాదులు చేసినట్లు జోగయ్య తన పిటీషన్లోనే చెప్పారు. దీనిపైన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్ బెంచ్ మండిపోయింది. రాష్ట్రపతికి, సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాశామని చెబితే తాము భయపడిపోతామా అంటూ దుమ్ముదులిపేసింది. అంటే తమను జోగయ్య బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చీఫ్ జస్టిస్ కు అర్ధమైపోయింది.





జోగయ్య దాఖలుచేసిన పిటీషన్లో పబ్లిక్ న్యూసెన్స్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్టు ఏముందని నిలదీసింది. జగన్ పైన పిటీషనర్ కు వ్యక్తిగత కక్షతోనే పిల్ వేసినట్లు తమకు అర్ధమైందన్నారు. పిటీషనర్ ఒక మాజీ ఎంపీ అయ్యుండి ఇలాగ వ్యవహరిస్తారా అంటూ గట్టిగా చివాట్లుపెట్టింది. ఎంపీగా పనిచేసిన పిటీషనర్ జాగ్రత్తగా వ్యవహరించాలని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.  అసలు కేసుకు నెంబర్ ఇవ్వలా వద్దా అనే విషయాన్ని విచారించేందుకు వీలుగా జూలై 6వ తేదీకి వాయిదావేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: