అమరావతి : వివేకా లేఖతో కొత్తగా ఏమి తెలుస్తుంది ?

Vijaya
హత్యకు గురైన వివేకానందరెడ్డి చివరగా రాసిన లేఖను నిన్ హైడ్రిన్ పరీక్షకు పంపేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకాలం ఈ పరీక్ష చేయాల్సిన అవసరంలేదు కాబట్టి లేఖను ఎవరు పట్టించుకోలేదు. అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పదేపదే లేఖ విషయాన్ని ప్రస్తావించారు. దాంతో లేఖపైన ఎంతమంది వేలిముద్రలు ఉన్నాయనే విషయాన్ని నిగ్గుతేల్చేందుకు లేఖను నిన్ డైడ్రిన్ పరీక్షకు పంపాలని సీబీఐ డిసైడ్ చేసింది. దానికి కోర్టు అనుమతిచ్చింది.ఇప్పటికే లేఖను రాసింది వివేకానే అన్న విషయం నిర్ధారణైంది. తీవ్ర ఒత్తిడిలోనే వివేకా లేఖరాసినట్లు ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నిపుణులు తేల్చారు. లేఖ రాసేసమయంలో వివేకా మానసిక పరిస్ధితిని కూడా విశ్లేషించారు. అంతాబాగానే ఉంది మరి లేఖపైన వేలిముద్రలు ఎవరెవరివి ఉన్నాయనే విషయాన్నే ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఇపుడా విషయమే నిన్ హైడ్రిన్ పరీక్షలో తేలుతుందంటున్నారు. ఓకే లేఖను ఎంతమంది చదివారనేది తేలుతంది. అయితే దాని వల్ల ఏమిటి ఉపయోగం ?వివేకా లేఖను మొదటిచూసింది పీఏ కృష్ణారెడ్డి. వివేకా చేతిరాతతో ఒక లేఖ ఉందని పీఏ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తర్వాత కూతురు సునీత మాట్లాడుతు ఆ లేఖను దాచిపెట్టమని, పోలీసులకు ఇవ్వవద్దని, ఎవరికీ చెప్పద్దని చెప్పినట్లు కృష్ణారెడ్డి సీబీఐకి చెప్పారు. కాబట్టి లేఖపైన పీఏ వేలిముద్రలుంటాయి. మద్యాహ్నం తర్వాత లేఖను కూతురు, అల్లుడు చూసుంటారు కాబట్టి వాళ్ళ వేలిముద్రలు కూడా పడేఉంటాయి.లేఖను ఇంకెవరైనా చూసుంటే వాళ్ళ వేలిముద్రలు కూడా తప్పకుండా ఉండే ఉంటాయని అనుకుందాం. అయితే దీనివల్ల కొత్తగా ఏమి తేలుతుంది ?  లేఖ చదివిన వాళ్ళందరికీ హత్యతో సంబంధం ఉందని అనుకునేందుకు లేదుకదా. ఎందుకంటే లేఖను చదివిన వళ్ళంతా హత్య జరిగిన తర్వాత మాత్రమే లేఖను చదివారు. మరి లేఖపై వేలిముద్రలు ఎవరెవరివో తేలితో కొత్తగా బయటపడే విషయాలు ఏమున్నాయి. ఇప్పటికే వివేకాను తాను గొడ్డలితో నరికి చంపినట్లు దస్తగిరి అంగీకరించాడు. హత్యలో పాత్రదారులుగా గంగిరెడ్డి, సునీల్ యాదవ్, శివకుమార్ రెడ్డి అంగీకరించారు. మరిక లేఖ ద్వారా తేలేదేముందో అర్ధం కావటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: