అమరావతి ఢిల్లీకి ఎందుకెళ్ళారో చంద్రబాబే బయటపెట్టారా ?

Vijaya



పార్టీనేతల సమీక్షలో చంద్రబాబునాయుడు తనంతట తానుగానే ఢిల్లీ టూర్ ఎందుకు వెళ్ళిందనే విషయాన్ని బయటపెట్టుకున్నారా ? అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణాకు చెందిన ఓ తమ్ముడు మాట్లాడుతు పొత్తుల విషయంలో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను చంద్రబాబు కలవటంలో తప్పేమీలేదని బండి అన్నారు.



అలాగే టీడీపీతో తమకు పొత్తుండదని కూడా బండి చెప్పారు. ఈ విషయాన్ని మాత్రమే సదరు తమ్ముడు ప్రస్తావించారు. దీనికి చంద్రబాబు బదులిస్తు ‘తానేమీ కేసుల కోసమో లేకపోతే కేసుల్లో ఉన్నవారిని రక్షించమని అడగటం కోసమో అమిత్ షా ను కలవలేద’న్నారు. కేవలం రాష్ట్రప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్ళినట్లు చెప్పారు. బండి చెప్పిందేమో టీడీపీ-బీజేపీ పొత్తు అవసరంలేదని. తెలంగాణా నేత ప్రస్తావించింది కూడా ఆ విషయాన్నే.



అయితే చంద్రబాబు మాత్రం ఎందుకని భుజాలు తడుముకున్నారు ? చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళింది కేసుల విషయం మాట్లాడటానికో లేకపోతే కేసుల్లో ఉన్నవారిని రక్షించమని అడగటానికేనా అని ఎవరూ అడగలేదు. చంద్రబాబు భుజాలు తడుముకున్నట్లు కేసులు ఎవరిమీదున్నాయి ? కేసులు, విచారణను ఎవరు ఎదుర్కొంటున్నారు ? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. కేసుల కోసం అంటే తన పరిపాలనలో అవినీతి జరిగిన ఆరోపణలపై సీఐడీ విచారణ జరుపుతోంది. కేసులు, అరెస్టుల దాకా రాకుండా మ్యానేజ్ చేసుకోవటం ఒక అంశం.



ఇక కేసుల్లో ఉన్నవారిని రక్షించటం కోసం అంటే మార్గదర్శి చీటింగ్ కేసును సీఐడీ విచారిస్తోంది. ఈ కేసులో ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజపై కేసులు నమోదయ్యాయి. సీఐడీ అరెస్టు చేసే అవకాశముందనే ప్రచారం బాగాజరుగుతోంది. బహుశా రామోజీ కూడా భయపడుతున్నట్లున్నారు. అందుకనే రామోజీని రక్షించమని రిక్వెస్టుచేసుకోవటం కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారనే ప్రచారం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరు ఆ ప్రస్తావన తేకపోయినా చంద్రబాబే తనంతట తానుగానే కేసులు, అరెస్టుల నుండి రక్షించమని అడగటం కోసం ఢిల్లీ వెళ్ళలేదని చెప్పారంటే కచ్చితంగా ఢిల్లీ టూర్ ఇందుకే అయ్యుంటుందని అందరు అనుకుంటున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: