ఏపీ: మరో మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు?

Purushottham Vinay
రానున్న మరో మూడు రోజుల పాటు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా ఉండాలని..ఏదైన అవసరమైతేనే బయటకి వెళ్లాలని అధికారులు సూచించారు.జూన్ 7 వ తేదీన అనగా బుధవారం నాడు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు ఇంకా ఎల్లుండి 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు అలాగే 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3°C, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9°C, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7°C, అల్లూరి జిల్లా కొండైగూడెం ఇంకా అలాగే తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.6°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఇక 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, ఇంకా 161 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు.ఇక రేపు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల ఇంకా అలాగే పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.


అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ ఇంకా తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య ఇంకా చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C – 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.అందుకే ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు ఇంకా బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు ఇంకా కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి అయిన డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. అలాగే మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు ఇంకా పశు-గొర్రె కాపరులు చెట్ల కింద ఉండరాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: