హైదరాబాద్ : సీబీఐని ఉతికేసిన హైకోర్టు..ఎంపీకి రిలీఫ్

Vijaya



వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ ముగిసింది. అవినాష్ తరపు లాయర్, సీబీఐ తరపు లాయర్ తమ వాదనలను వినిపించారు. హత్యజరిగిన నాలుగేళ్ళల్లో వివేకా మర్డర్ కేసుకు సంబంధించి ఇంత సుదీర్ఘంగా సాగిన విచారణ ఇదే మొదటిసారేమో. రెండురోజులు పూర్తిగా వివేకా మర్డర్ కేసు, అవినాష్ పాత్రపైన,  బెయిల్ ఇవ్వచ్చా ? కూడదా ? అనే అంశాలపైనే శుక్ర, శనివారాలు హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయమై జరిగిన విచారణలో సీబీఐని హైకోర్టు ఉతికేసింది. జడ్జి అడిగిన చాలా ప్రశ్నలకు సీబీఐ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు.



హత్యలో తన క్లైంట్ పాత్రలేదని అవినాష్ తరపు లాయర్, అవినాష పాత్రే కీలకమని సీబీఐ లాయర్ వాదించారు. అయితే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లున్నాయి. అవేమిటంటే హత్యలో అవినాష్ పాత్రకు సంబంధించి ఏమైనా గట్టి ఆధారాలు ఉన్నాయా అని జడ్జి అడిగితే సీబీఐ చేతులెత్తేసింది. హత్య జరిగినట్లు జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసనేందుకు ఆధారాలు ఏమిటన్న  జడ్జి ప్రశ్నకు సీబీఐ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. వివేకా హత్య రాజకీయ కారణాలతోనే జరిగిందని సీబీఐ లాయర్ చేసిన వాదనను జడ్జి కొట్టిపడేసినట్లే అనిపిస్తోంది.



ఎందుకంటే వివేకా మర్డర్ జరిగేనాటికే అవినాష్ ఎంపీ కదా అని జడ్జి అడిగితే సీబీఐ ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. ఎంపీ అభ్యర్ధిగా నేతలందరు అవినాష్ కే మద్దతిచ్చిన తర్వాత ఇక వివాదం ఏముందని జడ్జి అడిగారు.  నిజంగానే అవినాష్ అంతటి బలమైన నేపధ్యమున్న వ్యక్తే అయితే 2017లో ఎంఎల్సీగా వివేకానండరెడ్డి ఎందుకు ఓడిపోయారన్న కోర్టు ప్రశ్నకు సీబీఐ తరపున సమాధానంలేదు.



సిట్టింగ్ ఎంపీగా అవినాష్ కే మళ్ళీ టికెట్ ప్రకటించిన తర్వాత, అందరి మద్దతుతోనే టికెట్ దక్కిన తర్వాత మళ్ళీ వివేకాను చంపాల్సిన అవసరం అవినాష్ కు ఏముందన్న జడ్జి ప్రశ్నకు కూడా సీబీఐ లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి, డాక్టర్ ఉదయకుమార్ రెడ్డిని ఎందుకు అరెస్టుచేశారని జడ్జి అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఎంతసేపు సీబీఐ చెప్పిందేమంటే అవినాష్ రెడ్డి సహకరించటంలేదు కాబట్టే కస్టడీ అడుగుతున్నామని.  విచారణ ముగించిన హైకోర్ట బుధవారం నాడు తీర్పిస్తామని చెప్పింది. అప్పటివరకు ఎంపీని అరెస్టు చేయద్దని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: