అమరావతి : జగన్ లైన్ క్లియర్ చేస్తున్నారా ?

frame అమరావతి : జగన్ లైన్ క్లియర్ చేస్తున్నారా ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు జగన్మోహన్ రెడ్డి అవసరమైన మార్గాన్ని  రెడీచేస్తున్నారు. రాజధాని నియోజకవర్గాలంటే మంగళగిరి, తాడికొండ అని అందరికీ తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇపుడు వైసీపీ ఎంఎల్ఏలే ఉన్నారు. అయితే తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి పార్టీలైన్ దాటి క్రాస్ ఓటింగ్ చేశారని సస్పెండ్ చేశారు. కాబట్టి టెక్నికల్ గా వైసీపీ ఎంఎల్ఏనే అయినా ఆమె స్వతంత్ర ఎంఎల్ఏగానే వ్యవహరిస్తున్నారు.



జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల కాన్సెప్టును తెచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకత ఏస్ధాయిలో ఉందనేది తెలీదు. ఏదేమైనా వచ్చేఎన్నికల్లో రెండునియోజకవర్గాల్లోను వైసీపీ గెలుపు అనుమానంగా తయారైంది. అందుకనే ప్రత్యామ్నాయ ఓటుబ్యాంకును సృష్టించుకునే వ్యూహంతో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీకి జగన్ రెడీ అయ్యారు. 51 వేలమందికి ఒకేసారి పట్టాలను పంపిణీ చేయబోతున్నారు. 51 వేలమంది అంటే సుమారు 2 లక్షలమంది అన్నమాట.



ఈ 2 లక్షలమంది జనాల్లో 1.5 లక్షల మంది ఓటర్లుంటారని అంచనా. వీళ్ళంతా రాబోయే ఎన్నికల్లో వైసీపీకే ఓట్లేస్తారని జగన్ భావిస్తున్నట్లున్నారు. జగన్ వ్యూహం ప్రకారం వీళ్ళంతా  ఓట్లేస్తే రెండు నియోజకవర్గాల్లోను వైసీపీ గెలుపు ఖాయమన్నట్లే. పట్టాలు అందుకోబోతున్న లబ్దిదారుల్లో మంగళగిరిలో సుమారు 80 వేలమంది ఓటర్లవుతారు. మిగిలిన లబ్దిదారులు తాడేపల్లి నియోజకవర్గంలో పరిధిలోకి వస్తారు. వీళ్ళకు పట్టాలు ఇవ్వగానే టిడ్కో పథకంలో జగనన్న కాలనీలను ఏర్పాటుచేయాలన్నది జగన్ ఆలోచన.



పట్టాలిచ్చి, జగనన్న కాలనీలు ఏర్పాటయ్యే సమయానికి ఎన్నికలు రానే వస్తాయి. కాబ్టటి లబ్దిదారులు వైసీపీని మరచిపోరన్నది జగన్ ఆలోచన. లబ్దిదారుల రూపంలో ఓటర్లు రెడీగా ఉన్నపుడు పై రెండు నియోజకవర్గాల్లో అభ్యర్దులు ఎవరన్నది పెద్ద విషయమే కాదు. టీడీపీ తరపున మంగళగిరిలో  పోటీచేయబోతున్న లోకేష్, తాడికొండలో పోటీచేయబోతున్న శ్రవణ్ కుమారే గెలుపుకోసం నానా అవస్తలు పడాల్సుంటుంది. నిజానికి టీడీపీకి ఎలాంటి బేస్ లేని మంగళగిరిలో పోటీచేయటమే లోకేష్ చేసిన తప్పు. ఇపుడా తప్పుని కంటిన్యు చేయక తప్పేట్లులేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: