ఢిల్లీ : ఏర్పాట్లుచేస్తున్నా ప్రభుత్వంపై బురదచల్లుడేనా ?

Vijaya


మణిపూర్లో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్ధులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. మణిపూర్లో చదువుతున్న ఏపీ విద్యార్దుల్లో ఇప్పటికి 160 మందిని గుర్తించింది. వీళ్ళందరినీ ప్రత్యేక విమానాల్లో క్షేమంగా ఏపీకి తీసుకొచ్చింది. ఒక విమానం రాజధాని  ఇంఫాల్ నుండి కలకత్తా మీదుగా విశాఖపట్నంకు చేరుకుంది. మరో విమానం హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకుంది. ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లుచేస్తున్నా తమ్ముళ్ళు మాత్రం ఆరోపణలు చేస్తునే ఉన్నారు.



విద్యార్ధుల ప్రయాణానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లుచేసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత విమానాలు బయలుదేరే అవకాశముందని సమాచారం. ఇంఫాల్ నుండి విశాఖపట్నం, విజయవాడకు డైరెక్టుగా విమానాలు రావటానికి కుదరలేదు. అందుకనే చుట్టుతిరుగుడు ఏర్పాట్లుచేసింది. నేరుగా వచ్చినా, చుట్టుతిరుగుడుగా వచ్చినా విద్యార్ధులంతా క్షేమంగా రావటమే కావాల్సింది. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రకటించిన మొబైల్ నెంబర్లకు చాలామంది తల్లి, దండ్రులు ఫోన్లుచేస్తున్నారు. ఒకవైపు విద్యార్ధులను తెప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేస్తున్నా తమ్ముళ్ళు బురదచల్లేస్తున్నారు.



విషయం ఏమిటేంటే మణిపూర్లో ఎంతమంది విద్యార్ధులు చదువుతున్నారు అనే వివరాలు ఏపీ ప్రభుత్వం దగ్గర లేవు. హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్లుచేసిన కొందరు విద్యార్ధుల ద్వారా అక్కడ చదువుతున్న మిగిలిన విద్యార్ధుల వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ఆ విధంగా సేకరించిన వివరాల ప్రకారమే ఇప్పటికి 160 మందిని గుర్తించారు. వీరిలో మొదటివిడగా సుమారు 100 మందిని ఏపీకి రప్పించారు. ఇంఫాల్ నుండి కలకత్తాకు 49 మంది విద్యార్ధులు చేరుకున్నారని మిగిలిన విద్యార్ధులు విజయవాడకు చేరుకున్నారని ప్రభుత్వం చెప్పింది.



ఎప్పటికప్పుడు విద్యార్ధుల వివరాలను సేకరించి ఎక్కడెక్కడో చదువుతున్న విద్యార్ధులందరినీ ఇంఫాల్ కు చేరవేయటమే పెద్ద సమస్యగా మారింది. ఈమధ్యనే సూడాన్ అంతర్యద్ధంలో కూడా ఇలాంటి సమస్యనే కేంద్రప్రభుత్వం ఎదుర్కొంది. సూడాన్ దేశంలో ఉంటున్న వాళ్ళందరినీ పోర్ట్ సూడాన్ కు చేరుకోమని కేంద్రప్రభుత్వంతో పాటు సూడాన్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే దేశంలో ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళంతా పోర్టు సూడాన్ కు చేరుకోవటమే పెద్ద సమస్య అయ్యింది. అలాంటి సమస్యే ఇపుడు మణిపూర్లో కూడా ఎదురవుతోంది. అందుకనే ఏపీ ప్రభుత్వం కేంద్రం ద్వారా మణిపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: