హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?
వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వివేకా మర్డర్ కు ఇప్పటివరకు చెబుతున్న కారణాలకు కొత్త కారణం భిన్నంగా ఉంది. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి బయటపెట్టారు. ఇంతకీ ఆ కొత్తకోణం ఏమిటంటే లైంగికంగా వేధించటం వివేకా మర్డర్ కు కారణమన్నారు. నిరంజన్ రెడ్డి చెప్పిందేమిటంటే నిందితుల్లో ఒకడైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారట.
వివేకాను అడ్డుకోవాలని సునీల్ ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదట. దాంతో తన తల్లిని లైంగికంగా వేధిస్తున్న వివేకాపై సునీల్‌లో కోపం పెరిగిపోయిందట. దాంతో సమయం రాగానే హత్య చేశాడని లాయర్ చెప్పారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో వివేకాపై ఒక్కసారి కూడా లైంగిక ఆరోపణలు వినబడలేదు. ఇప్పటివరకు చాలా కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అవేమిటంటే ఆస్తి తగదాలు. వివేకా ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్నారని ఆస్తి పంపకాల విషయంలోను, వారసుడిని ప్రకటించే విషయంలో కుటుంబంలోనే గొడవలవ్వటంతో మర్డర్ కు దారితీసిందని.
బెంగుళూరులో ఒక ఆస్తి సెటిట్‌మెంట్ లో వివేకా రు. 100 కోట్లు వసూలు చేసినట్లు కూడా ప్రచారంలో ఉంది. సెటిల్మెంట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని తన దగ్గరే ఉంచేసుకుని తన సిండికేట్ లోని వాళ్ళకు చాలా తక్కువ ఇచ్చారట. ముందుగా అనుకున్నట్లు కూడా తమకు చాలా తక్కువ డబ్బులు ఇవ్వటంతోనే అందరికీ వివేకాపై కోపం వచ్చి చంపేశారనే ప్రచారం తెలిసిందే.
చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా ప్రచారం చేస్తున్న కడప ఎంపీ సీటు వివాదం కూడా తెలిసిందే. ఆల్రెడీ ఎంపీగా ఉండి, మరోసారి ఎంపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న అవినాష్ కు వివేకాను చంపాల్సిన అవసరం ఏమిటనే చిన్న లాజిక్ ను చంద్రబాబు, ఎల్లోమీడియా కావాలనే పక్కనపెట్టేస్తోంది. ఇన్ని సంవత్సరాలు సీబీఐ దర్యాప్తు అయినా, కోర్టులో విచారణయినా పై మూడు పాయింట్ల మీదే నడిచింది. అలాంటిది ఇపుడు హఠాత్తుగా లైంగిక వేధింపులనే కోణం బయటపడింది. మరీ కొతకోణంతో కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.