అమరావతి : జగన్..మగాడ్రా బుజ్జీ అంటున్నారా ?

Vijaya


రాష్ట్రంలోని మీడియా సర్కిళ్ళతో పాటు మామూలు జనాల్లో కూడా సోమవారం ఉదయం నుండి ఒక విషయం బాగా వైరల్ అవుతోంది. అదేమిటంటే రామోజీరావును సీఐడీ అధికారులు విచారించారు అనే విషయం. రామోజీ గ్రూపు సంస్ధల యాజమాన్యంలో ఎన్ని అవకతవకలున్నా, ఎంత అవినీతి జరుగుతోందని ప్రచారం జరిగినా అదంతా ప్రచారంగానే మిగిలిపోయింది. రామోజీ సంస్ధల వైపు అనుమానంతో చూసేందుకు కూడా ఏ ప్రభుత్వం సాహసించలేదు.



అలాంటిది ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శిపైన దాడులు చేయటం, కేసులు నమోదుచేసి విచారించి అరెస్టులు కూడా చేసింది. వాళ్ళని వీళ్ళని కాకుండా ఏకంగా రామోజీరావు, ఆయన కోడలు శైలజపైన చీటింగ్ కేసు నమోదు చేసింది. చివరకు విచారణ కూడా మొదలుపెట్టేసింది. ఇక్కడే జగన్ విషయంలో అందరు వాడు మగాడ్రా బుజ్జీ అనే సినిమా డైలుగును గుర్తుచేసుకుంటున్నారు. సోమవారం రామోజీని సీఐడీ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు.



పైగా రామోజీ, కోడలుపైన ఏడు కేసులు నమోదుచేశామని ఇపుడు జరిగిన విచారణ ఒక కేసులో మాత్రమే అని సీఐడీ ప్రకటించింది. అంటే ఇంకా ఆరుకేసుల్లో విచారణ ఉంటుందని చెప్పకనే చెప్పింది. రామోజీని విచారించటం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నది చంద్రబాబునాయుడు మాత్రమే. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడుతున్నదే రామోజీ అని అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని జగన్ ఎన్నోసార్లు బహిరంగ సభల్లోనే చెప్పారు. అందుకనే రామోజీని దెబ్బకొడితే ఆ దెబ్బ ఎవరికి తగులుతుందో జగన్ కు బాగా తెలుసు.



చంద్రబాబును దెబ్బకొడితే రామోజీకి డైరెక్టుగా ఎఫెక్టుండదు. అదే రామోజీని కొడితే ఆ దెబ్బకు విలవిల్లాడేది చంద్రబాబే. అందుకనే జగన్ తెగించి ఏదైతే అది అవుతుందని డిసైడ్ చేసుకునే రామోజీ మీద చీటింగ్ కేసులు పెట్టి విచారణ మొదలుపెట్టించింది. ఇపుడీ విషయమే మీడియాతో పాటు మామూలు జనాల్లో కూడా ఫుల్లుగా వైరల్ అయ్యింది. మీడియా చేతిలో ఉందికదాని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతే చివరకు ఏమవుతుందనేందుకు రామోజీ విచారణే తాజా ఉదాహరణ. సోనియా గాంధీనే థిక్కరించి బయటకు వచ్చి సమస్యలను ఎదుర్కొని నిలదొక్కుకున్న జగన్ కు రామోజీ ఒక లెక్కా అని మీడియా మిత్రులతో పాటు మామూలు జనాలు కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: