అమరావతి : పవన్ విషయం దీంతో తేలిపోతుందా ?

Vijaya




విషయం ఏమిటో తెలీదుకానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్జంటుగా ఢిల్లీకి వెళ్ళారు. వెళ్ళిందేమో హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవటం కోసమే. కానీ సమావేశమైంది మాత్రం ఏపీ ఇన్చార్జి మురళీధరన్ తో. ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ? ఏమి మాట్లాడుదామని అనుకున్నారనే విషయాలు సస్పెన్సుగా ఉండిపోయాయి. ఎందుకంటే బీజేపీతో కటీఫ్ చెప్పుకుని టీడీపీతో పొత్తు పెట్టుకుందామని పవన్ ప్రయత్నాలు అందరికీ తెలుస్తున్నాయి.





రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుంటుందని పవనే చెప్పారు. బీజేపీతో పొత్తు చిత్తు చేసుకోవాలని అనుకుంటున్నపుడు మళ్ళీ బీజేపీ పెద్దలను కలవటానికి ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్లు ? నాలుగు ఎంఎల్సీను గెలిచిన ఊపులో ఉన్న టీడీపీ కూడా మునుపుటిలో పొత్తుకోసం పవన్ వెంట పడటంలేదని సమాచారం. దాంతో పవన్ లో అయోమయం పెరిగిపోతోందట. ఈ నేపధ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి మురళీధరన్ తో భేటీ అయ్యారట.





బీజేపీ నేతల సమాచారం ఏమిటంటే కర్నాటక ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ తో మురళీ మాట్లాడినట్లు తెలుస్తోంది. కోలారు, బళ్ళారి, చిక్ బళాపూర్, హోసూరు, తుముకూరు ప్రాంతాలతో పాటు బెంగుళూరు సిటిలో తెలుగువాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు సుమారు 70 దాకా ఉన్నట్లు సమాచారం. ఈ 70 నియోజకవర్గాల్లో పవన్ తో ప్రచారం చేయించుకోవాలన్నది బీజేపీ అగ్రనేతల ఆలోచనగా తెలుస్తోంది.





ఒకవేళ కర్నాటక ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి అంగీకరిస్తే ఏపీలో కూడా కమలంపార్టీతో పొత్తులోనే ఉండటానికి పవన్ సిద్ధపడ్డారని అనుకోవాలి. బీజేపీతో పొత్తులో ఉండటం పవన్ కు ఇష్టంలేకపోతే సినిమా షూటింగులన్నింటినీ రద్దు చేసుకుని కర్నాటక ఎన్నికల్లో ప్రచారానికి పవన్ వెళ్ళరు. మే 10వ తేదీన కర్నాటకలో ఎన్నికలు అయిపోయే సమయానికి తెలంగాణా ఎన్నికల వాతావరణం మంచి పీక్సులోకి వచ్చేస్తుంది. ఎందుకంటే  తెలంగాణాలో డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సుంది. ఇదయ్యే సమయానికి ఏపీలో ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కేసుంటుంది. మే నెలలో షెడ్యూల్ ఎన్నికలు జరగాలి. కాబట్టి పవన్ కు ఇక సినిమా షూటింగులు కష్టమే. మరి కర్నాటక ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తారా లేదా అన్నదే కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: