అమితాబ్ అలాంటి తప్పులు చెయ్యొద్దు: సజ్జనర్

Purushottham Vinay
సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న హీరోలు, హీరోయిన్లు యాడ్‌ ప్రమోషన్స్‌ చేయడం కొత్త విషయం ఏమి కాదు. వీరు సినిమాలతో పాటు పలు రకాల కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తూ రెండు చేతులా బాగా సంపాదిస్తున్నారు.ఇక అలా యాడ్ ప్రమోషన్స్‌ ద్వారా ఎన్నో కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న నటుట్లో బాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరో అయిన అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఒకరు. బిగ్‌ బీకి ఉన్న క్రేజ్‌, పాపులారిటీ కారణంగా ఆయన ప్రమోట్‌ చేశారంటే ఆ ప్రొడక్ట్స్‌ ఇట్టే జనాల్లోకి బాగా దూసుకుపోతాయి. అందుకే పలు కంపెనీలు ఇంకా సంస్థలు కోట్లలో డబ్బులు ఇచ్చి బిగ్‌ బీని తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంటున్నారు. అయితే అమితాబ్ డబ్బులు కోసం ప్రమోట్‌ చేసే కంపెనీల్లో కొన్ని జనాలను మోసం చేస్తున్నాయని, దయచేసి అలాంటి వాటికి ప్రచారం చేయద్దంటున్నారు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఇంకా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌. అమితాబ్‌ బచ్చన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేస్తున్నారు.


అయితే చైన్ లింక్ వ్యాపారం పేరుతో ఈ కంపెనీ జనాలను మోసం చేసిందని పలు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి 2022 వ సంవత్సరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఇక ఆమ్వే ఆస్తులను  కూడా జప్తు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కూడా కొనసాగుతోంది.ఇక ఈ క్రమంలో ఆమ్వేకు అమితాబ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడాన్ని వీసీ సజ్జనార్‌ తప్పుపట్టారు. 'అమితాబ్‌ బచ్చన్ తో పాటు మిగిలిన స్టార్‌ హీరోలందరికి నాదొక విన్నపం. మోసం చేసే కంపెనీలని దయచేసి ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్‌ను కేవలం మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై అస్సలు వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు ఇంకా వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది' అని ట్విట్టర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు సజ్జనార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: