ఢిల్లీ : వివేకా కేసులో సీబీఐకి కళ్ళు బైర్లు కమ్మాయా ?

Vijaya

వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణలో సీబీఐకి సుప్రింకోర్టు మామూలు షాక్ ఇవ్వలేదు. విచారణ అధికారి రామ్ సింగ్ ను మార్చేసింది. ఆయన స్ధానంలో ప్రత్యేకంగా దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసింది. దీనికి సీబీఐ డీఐజి చౌరాసియా నాయకత్వం వహిస్తారు. చౌరాసియా ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్పీలు వికాస్ సింగ్, ముఖేష్ కుమార్ బృందంతో  సిట్ ను ఏర్పాటుచేయటమే కాకుండా దర్యాప్తు ముగింపుకు ఏప్రిల్ 30వ తేదీ గడువు కూడా విధించింది. ఈ రెండు విషయాలు సీబీఐ ఊహించుండదు.ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రామ్ సింగ్ నే దర్యాప్తు అధికారిగా కంటిన్యు చేయాలని సీబీఐ ఎందుకింతగా పట్టుబట్టిందో అర్ధంకావటంలేదు. సీబీఐ పట్టుబట్టిన విధానమే బహుశా సుప్రింకోర్టులో అసహనాన్ని పెంచేసుంటుంది. రెండురోజుల విచారణలో మర్డర్ కేసును రామ్ సింగ్ మాత్రమే విచారణ చేస్తారని సీబీఐ లాయర్ పదే పదే వాదించారు. దీంతో సుప్రింకోర్టుకు మండిపోయి రామ్ సింగ్ ను దర్యాప్తు అధికారిగా మార్చేస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. దాంతో సీబీఐ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది.ఇక్కడే మూడు అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొదటిది రామ్ సింగ్ నాలుగున్నరేళ్ళ దర్యాప్తులో ఒకే కోణంలో ఎందుకు విచారించారో అర్ధంకావటంలేదు. అన్నీ కోణాల్లో విచారణ చేసుంటే అనుమానితులందరినీ విచారించుంటే ఇప్పటికే దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చుండేదేమో. రెండు అనుమానం ఏమిటంటే నాలుగున్నరేళ్ళల్లో పూర్తికాని దర్యాప్తు నెల రోజుల్లో ఎలా సాధ్యమవుతుంది ? మూడో అనుమానం ఏమిటంటే రామ్ సింగ్ దర్యాప్తులో ఎంపీ అవినాష్ రెడ్డి, నిందితుడు శివశంకరరెడ్డి భార్య తులశమ్మ తదితరుల వాదనను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు.మొత్తానికి మర్డర్ కేసులో సీబీఐని సుప్రింకోర్టు ఫుల్లుగా వాయించేసింది. బుధవారం విచారణలో న్యాయమూర్తి సీబీఐ లాయర్ వాదనలను అసలు పరిగణలోకే తీసుకోలేదని అర్ధమైపోయింది. తమలో ఇన్ని లోపాలు పెట్టుకుని కూడా సీబీఐ జడ్జిని కన్వీన్స్ చేయాలని ఎలాగ ప్రయత్నించిందో అర్ధం కావటంలేదు. సరే విచారణకు ఏర్పాటైన సిట్ నెల రోజుల్లో ఎలాంటి నివేదికను సబ్మిట్ చేస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: