అమరావతి : చంద్రబాబును నమ్మితే ముణిగిపోవటమేనా ?

Vijaya
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును నమ్మిన వాళ్ళగతి చివరకు ఏమవుతుందనేందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. అందరికీ తెలిసింది, అందరి కళ్ళముందు ఉన్న ఉదాహరణలు ఏమిటంటే వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏల పరిస్ధితే. 2014లో వైసీపీ తరపున గెలిచిన వారిలో 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించారు. వీరిలో నలుగురు మంత్రులు కూడా అయ్యారు. అయితే చివరకు వాళ్ళగతి ఏమైందో అందరు చూస్తున్నదే. అప్పట్లో వాళ్ళకి ఏమి హామీలిచ్చారో తెలీదు కానీ అన్యాయమైపోయారు.ఇపుడిదంతా ఎందుకంటే రాజధాని నియోజకవర్గం ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవిని చూసిన తర్వాత అప్పటి ఫిరాయింపు ఎంఎల్ఏల పరిస్ధితే గుర్తుకొచ్చింది.  శ్రీదేవి మీడియాతో మాట్లాడుతు రాజధానిగా అమరావతికి జై కొట్టారు. రాజధానిగా అమరావతే ఉండేలా రైతులతో కలిసి ఆందోళనలు చేస్తారట. ఢిల్లీలో చదువుకొంటున్న తన కూతురును ఏపీకి రాజధాని ఏదని ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నట్లు చెప్పారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.ఇంకా చాలానే చెప్పారు కానీ శ్రేదేవి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని అర్ధమైపోతోంది. ఎందుకంటే వైసీపీలో ఉన్నంతవరకు అమరావతి ఉద్యమం పెయిడ్ ఉద్యమమన్నారు. రైతులను పెయిడ్ రైతులంటు నానా రచ్చచేశారు. అమరావతి ఉద్యమం అంతా బోగసన్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులతోనే సాధ్యమన్నారు. తనతో గొడవలుపడిన అమరావతి ప్రాంతజనాలపై పోలీసులను ఉసిగొల్పారు.అలాంటి శ్రీదేవి వైసీపీ నుండి సస్పెండ్ కాగానే  హఠాత్తుగా  అమరావతే రాజధానంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో శ్రీదేవికి చంద్రబాబు అసలు టికెట్ ఇస్తారా ? క్రాస్ ఓటింగ్ కు ముందు చంద్రబాబు నుండి ఎంఎల్ఏకి ఎలాంటి కమిట్మెంట్ అందిందో తెలీదు. ఓన్లీ క్యాష్ మాత్రమే అయితే ఓకే. అలా కాకుండా టికెట్ కూడా అయితే ఎంఎల్ఏ దాదాపు మోసపోయినట్లే. ఎందుకంటే నియోజకవర్గంలో తాడికొండ శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఈయన్ను కాదని శ్రీదేవికి టికెట్ దక్కేది అనుమానమే. పైగా సస్పెన్ష్ కారణంగా ప్లేటు మారిస్తే జనాలు ఓట్లేస్తారా ? ఏమిటో శ్రీదేవి పరిస్ధితి చివరకు అప్పటి ఫిరాయింపు ఎంఎల్ఏల్లాగే అయిపోతుందేమో.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: