అమరావతి : పవన్ కు నోరు లేవటం లేదా ?

Vijaya
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. లోకంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, అరాచకాలంతా జగన్మోహన్ రెడ్డే చేస్తున్నారనే భ్రమలో ఉంటారు. అక్రమాలు, అనైతికతకు ఎవరు పాల్పడినా అవన్నీ జగనే చేస్తున్నారనే అనుకుంటారు. అందుకనే 24 గంటలూ 365 రోజులు పవన్ ప్రశ్నించేది కేవలం జగన్ను మాత్రమే. తన ఆరాధ్య దైవం చంద్రబాబునాయుడు చేసే అక్రమాలు, అనైతికం పవన్ కు అసలు కనబడనే కనబడదు.ఇపుడిదంతా ఎందుకంటే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి కదా. అందులో గెలుపు అవకాశం లేకపోయినా పంచుమర్తి అనూరాధతో చంద్రబాబు నామినేషన్ వేయించారు. తీరాచూస్తే ఫలితాల్లో అనూరాధ గెలిచారు. ఎంఎల్సీ అభ్యర్ధికి కావాల్సిన 22 మంది ఎంఎల్ఏల ఓట్ల బలం లేకపోయినా అనూరాధకు 23 ఓట్లు ఎలాగవచ్చాయి ? ప్రస్తుతం టీడీపీకి ఉన్నదే 19 ఓట్లయితే ఆశ్చర్యకరంగా ఆమెకు 23  ఓట్లు వచ్చాయి.వైసీపీలోని ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి టీడీపీకి అనుకూలంగా ఓట్లేశారంటే అర్ధముంది ? మరి మిగిలిన ఇద్దరు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఓట్లు టీడీపీకి ఎందుకు పడ్డాయి ? మరీ విషయం పవన్ కల్యాణ్ ఎందుకని చంద్రబాబును అడగలేదు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని పదేపదే చెప్పుకునే పవన్ కు చంద్రబాబు అనైతికానికి పాల్పడినట్లు అనిపించలేదా ?ఏమిచేస్తే వైసీపీలోని ఇద్దరు ఎంఎల్ఏలు టీడీపీ అభ్యర్ధికి అనుకూలంగా ఓట్లేశారని చంద్రబాబును పవన్ ఎందుకని అడగటంలేదు ? ప్రశ్నించాల్సినంత విషయంగా పవన్ కు అనిపించలేదా ? లేకపోతే వైసీపీ ఎంఎల్ఏలను ప్రలోభానికి గురిచేసి చంద్రబాబు ఓట్లు వేయించుకోవటం పవన్ కు తప్పని పించలేదా ?  అదీకాదంటే తన ఆరాధ్య దైవం చంద్రబాబు ఎంతటి అనైతికానికి పాల్పడినా పవన్ కు సక్రమంగానే కనిపిస్తుందా ? అదే జగన్ విషయంలో అయితే  బూతద్దం పెట్టి మరీ చిన్న నలకంత కనబడినా రెచ్చిపోవటమే తెలుసు పవన్ కు. ఎందుకంటే ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టింది జగన్ను ప్రశ్నించేందుకు మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: