అమరావతి : జగన్ కు వైఎస్ కుటుంబానికి సంబంధంలేదా ?

Vijaya
ప్రత్యర్ధిని టార్గెట్ చేసి బురదచల్లి గబ్బుపట్టించటంలో తెలుగుదేశంపార్టీకి మించిన పార్టీ లేదు. తాజాగా తన అధికారిక ట్విట్టర్ వేదికపై జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వేసిన ప్రశ్నే ఉదాహరణ. తన ట్విట్టర్లో టీడీపీ ఏమని చెప్పిందంటే  కడప ఎంపీ సీటుకోసమే వైఎస్ వివేకానందరెడ్డి హత్యజరిగిందని సీబీఐ చెప్పిందట. వైఎస్ కుటుంబాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా ? అని  ప్రశ్నించింది.ఇక్కడే టీడీపీ అతితెలివి బయటపడుతోంది. వైఎస్ కుటుంబాన్ని కాదని అవినాష్ రెడ్డికి జగన్ రెడ్డి సీటు ఇచ్చింది వాస్తవం కాదా అంటే మరి జగన్ ఎక్కడి నుండి వచ్చారు ? వైఎస్ కుటుంబం కాదా ? అసలు వైఎస్ కుటుంబం అంటేనే ఇపుడు జగనే కదా. వివేకానందరెడ్డి వేరు జగన్ కుటుంబం వేరు. వైసీపీ పార్టీ పెట్టిందే జగన్. అంటే పార్టీ జగన్ సొంతమే.  తన పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలని అనుకుంటే వాళ్ళకి జగన్ ఇస్తారు.  ఇందులో వేరొకళ్ళ ప్రమేయమే ఉండదు.వివేకాను కాదని కడప ఎంపీ సీటును అవినాష్ కు ఇవ్వదలచుకున్నారు కాబట్టే 2014లో అవినాష్ వైసీపీ ఎంపీ అయ్యారు. 2019లో కూడా జగన్ టికెట్ ఇచ్చింది అవినాష్ కే కాని వివేకాకు కాదు. అవినాష్ కు వివేకా ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రచారంలో ఉండగానే వివేకా హత్యకు గురయ్యారు. కాబట్టి టికెట్  కోసమే వివేకాను అవినాష్ హత్యచేశారన్న వాదనే విచిత్రంగా ఉంది.సిట్టింగ్ ఎంపీ హోదాలో  రెండోసారి పోటీచేస్తున్నపుడు వివేకాను చంపాల్సిన అవసరం అవినాష్ కు ఏముంటుంది ? వైఎస్సార్ చనిపోయిన దగ్గర నుండి జగన్ కు వెన్నుదన్నుగా నిలిచింది అవినాషే  కానీ వివేకా కాదు. పులివెందుల ఉపఎన్నికల్లో విజయమ్మకు పోటీగా కాంగ్రెస్ తరపున పోటీచేసింది వివేకానే అన్న విషయం అందరికీ తెలుసు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేంతవరకు వైఎస్ కుటుంబానికి  వివేకా దూరంగానే ఉన్నారు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఎంపీ టికెట్ కోసమే వివేకాను అవినాష్ హత్యచేశారని సీబీఐ, టీడీపీ, ఎల్లోమీడియా చెప్పేదాంట్లో లాజిక్కే కనిపించటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: