అమరావతి : రెడ్లంటే పవన్లో ఇంత ధ్వేషముందా ?

Vijayaజగన్మోహన్ రెడ్డంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నివువెల్లా ధ్వేషమని అందరికీ తెలిసిందే. అయితే ఆ ధ్వేషం జగన్ పైన మాత్రమే అని ఇప్పటి వరకు అందరు అనుకుంటున్నారు. కానీ అది తప్పని పవన్ ధ్వేషం జగన్ పైన కాదు యావత్ రెడ్డి సామాజికవర్గంపైనే అని తాజాగా బయటపడింది. జగన్ పైన ధ్వేషమంటే ఏదోలే రాజకీయ వైరమని సర్దుకుంటారు. కానీ అసలు రెడ్లంటేనే పడకపోతే ఏమనుకోవాలి. బందరు బహిరంగసభలో పవన్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో జగన్ను ఓడించమని చెప్పలేదు.ఏకంగా రెడ్లను  అధికారానికి దూరంగా ఉంచాలని పదేపదే పిలుపిచ్చారు. నిజానికి పవన్ కు రెడ్లలో ఎవరితో అయినా గొడవైందో ఏమో తెలీదు. రెడ్డి సామాజికవర్గంపై పవన్ ఎందుకింత ధ్వేషం పెంచుకున్నారో కూడా అర్ధంకావటంలేదు. కాకపోతే అందరికీ కనబడుతున్న కారణం మాత్రం చంద్రబాబునాయుడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ అమితంగా ఆరాధించే రాజకీయ నేత చంద్రబాబన్న విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబును 2019 ఎన్నికల్లో జగన్ చావుదెబ్బ కొట్టారు. అప్పుడు కొట్టిన దెబ్బనుండి చంద్రబాబు ఇప్పటికీ కోలుకోలేదు.తన ఆరాధ్య దైవాన్ని అంతగా చావుదెబ్బ కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన పవన్ అకారణంగా జగనంటే ధ్వేషం పెంచుకున్నట్లు అర్ధమవుతోంది. పైగా ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా పవన్ను రాజకీయ నేతగా జగన్ ఎప్పుడూ చూడలేదు. ఈ మంట కూడా పవన్లో బాగా ఉంది. సో, రెండు కలిపి జగన్ అని కాకుండా మొత్తం రెడ్లంటేనే పవన్లో ధ్వేషం పెరిగిపోయింది. లేకపోతే రెడ్డి సామాజికవర్గాన్ని అధికారం నుండి దూరంగా పెట్టమని పదేపదే బహిరంగంగా ఎందుకు చెప్పాల్సొచ్చింది ? రెడ్లు ఓట్లేస్తేనే జగన్ అధికారంలోకి వచ్చారా ? పవన్ అభిమానుల్లో రెడ్లులేరా ? మరి రెడ్లపై ఇంతటి ధ్వేషాన్ని ప్రకటించిన తర్వాత అభిమానుల్లో రెడ్లు దూరమైతే పవన్ కు నష్టం కాదా ? అసలు కులాన్ని చూసి ఓట్లేసే జనాలు చాలా తక్కువమందుంటారని పవన్ కు తెలీదా ? ఏమిటో రెడ్లంటే తనకు మంటనే విషయాన్ని బయటపెట్టుకునేందుకు పవన్ మీటింగ్ పెట్టినట్లున్నారు.  
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: