కోస్తా : చిన్న లాజిక్ మిస్సయిన కోటంరెడ్డి

Vijaya




తన బాధలు చెప్పుకున్నాడు, కష్టాలు, అవమానాలు కూడా చెప్పుకున్నాడు. అవమానాలను  ఎంతకాలం నుండి భరిస్తున్నాడో కూడా వివరించాడు. అయితే ఆ చెప్పుకోవటంలో చిన్న లాజిక్ మిస్సయాడు. ఇక్కడే అందరికీ ఆ వ్యక్తిపై అనుమానాలు మొదలైపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఇదంతా నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి గురించే. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని మండిపోయారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటు రెచ్చిపోయిన కోటంరెడ్డి జగన్మోహన్ రెడ్డి, భారతిల ఫోన్లను ట్యాప్ చేస్తే ఎలాగుంటుందని సూటిగా ప్రశ్నించారు.



అంతాబాగానే ఉందికానీ అసలు తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు కోటంరెడ్డికి ఎలా తెలిసింది. నాలుగు నెలల క్రితం తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు తనకొక ఐపీఎస్ అధికారి చెప్పారట. అప్పట్లో ఆ అధికారి చెప్పింది తాను నమ్మలేదన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు 20 రోజుల క్రితమే తనకు ఆధారాలతో సహా దొరికిందట. ఇంతకీ ఆ ఆధారాలు ఏమిటంటే ఎవరితోనో తాను మాట్లాడిన మాటలను విని, రికార్డుచేసి ఓ ఉన్నతాధికారి ఆ రికార్డింగును తనకే పంపించారట. ఆ రికార్డింగును తనకు పంపించి తనను బెదిరించారని కోటంరెడ్డి చెప్పారు.



ఇక్కడే కోటంరెడ్డి లాజిక్ మిస్సయ్యారు. ఎవరి ఫోనైనా ఎవరైనా ఎందుకు ట్యాప్ చేస్తారు ? వాళ్ళు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారో వినేందుకే కదా. మరలాంటపుడు కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభుత్వం ఆ విషయాన్ని స్వయంగా ఎంఎల్ఏకే ఎందుకు చెబుతుంది ? తన మాటలను ట్యాపింగ్ ద్వారా దొంగతనంగా విని, రికార్డు చేసి ఆ రికార్డింగును మళ్ళీ తనకే పంపినట్లు కోటంరెడ్డి చెప్పారు. దొంగతనంగా విని, రికార్డింగ్ చేసిన వాళ్ళు ఆ రికార్డింగును ముఖ్యమంత్రికి పంపుతారు కానీ తిరిగి కోటంరెడ్డికే పంపుతారా ?



ట్యాపింగ్ అంటేనే తెలియకుండా చేసేది. అలాంటిది ట్యాప్ చేసిన విషయం ప్రభుత్వం ఎందుకని ఎంఎల్ఏకి చెబుతుంది ? ఇక్కడే కోటంరెడ్డి చెప్పిన విషయం అర్ధంకావటంలేదు. ఇక్కడే ఎంఎల్ఏ లాజిక్ మిస్సయ్యారు. ఏదేమైనా టీడీపీలో చేరాలని డిసైడ్ చేసుకున్నారు వెళిపోతున్నారు. ఇంతోటిదానికి ఇంత గోల చేసుకుని బయటకు వెళ్ళిపోవాలా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: